High Court : హైదరాబాద్ : బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఉత్కంఠకు తెర దించింది తెలంగాణ హైకోర్టు. ఈ మేరకు ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు (High Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై స్టే ఇచ్చింది. వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నాలుగు వారాల లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీసీ సంక్షేమ సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున హైకోర్టు వద్దకు చేరుకున్నారు. బీసీలకు న్యాయం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Telangana High Court Key Comments
పెద్ద ఎత్తున పోలీసులు కోర్టు ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఇదంతా ముందు నుంచి ఊహించిందేనని బీసీ నేతలు భగ్గుమంటున్నారు. అగ్రవర్ణాలకు చెందిన వారు కావాలని బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లపై అడ్డుకునేలా పిటిషన్లు దాఖలు చేశారని ఆరోపిస్తున్నారు. కౌంటరేమో నాలుగు వారాల్లో దాఖలు చేయాలని, ఈ అంశానికి సంబంధించి ఆరు వారాల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు జడ్జి విజయ్ సేన్ రెడ్డి. ఇదిలా ఉండగా ఓ వైపు హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి విచారణ కొనసాగుతూ ఉండగానే రాష్ట్ర ఎన్నికల సంఘం హుటా హుటిన నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా నిలిచి పోనున్నది. నెల రోజుల పాటు అడ్డంకి ఏర్పడనుంది.
Also Read : Kantara 1 Sensational Collections : వసూళ్ల వేటలో కాంతారా చాప్టర్ -1 రికార్డ్

















