Harish Rao : హైదరాబాద్ : ఏరికోరి ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేసిన పాపాన పోలేదన్నారు. గురువారం హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరారు గజ్వేల్‌కు చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీపీ పద్మా నరేందర్, వందకు పైగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా హరీష్ రావు (Harish Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక విధానాలు పాటించడం సహించక బీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకు వస్తున్నారని తెలిపారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అని అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు.
Harish Rao Slams Congress Govt
రైతు బోనస్ బోగస్ చేశారు, రూ. 1300 కోట్లు పెండింగ్‌లో పెట్టారని ఆరపించారు హరీశ్ రావు. తన అసమర్థ విధానాల వల్ల, చేతకాక ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్న మాట నీటి మూటలుగా మారాయని మండిపడ్డారు. పింఛన్లు పెంచడం దేవుడెరుగు, ఉన్న పింఛనల్లో కోత విధించారని ఫైర్ అయ్యారు. అభయహస్తం మేనిఫెస్టోలో మహాలక్ష్మి పేరిట ఇచ్చిన గ్యారెంటీలోని మొదటి హామీ ప్రతి మహిళకు నెలకు రూ. 2500 గురించి ప్రస్తావన లేదన్నారు. చివరి గ్యారెంటీ చేయూతలో చెప్పిన రూ. 4000 పింఛన్ గురించి ఇప్పుడు నోరు మెదపడం లేదన్నారు. పరిపాలన గాలికి వదిలి, ప్రతీకార చర్యలకు ప్రభుత్వం దిగిందన్నారు.
Also Read : Yuzvendra Chahal Strong Response : మోస పోయానే తప్పా మోసం చేయలేదు

















