Hydraa : హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దూకుడు పెంచారు. ప్రజావాణి సందర్భంగా తమకు తాజాగా వచ్చిన 41 ఫిర్యాదులపై ఆయన దృష్టి సారించారు. హైడ్రా (Hydraa) కమిషనర్ రంగం లోకి దిగారు. ఆయా ఫిర్యాదులకు సంబంధించిన కబ్జాలను స్వయంగా పరిశీలించారు. ఇందులో భాగంగా తూముకుంట మున్సిపాలిటీలో పర్యటించారు. దేవరాయాంజాల్ విలేజ్ లో సర్వే నంబర్ 135, 136లలో రహదారిలో ఆటంకాలు కలిగిస్తున్న వివాదంపై హై కోర్టు ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. అదే మార్గంలో కొత్తగా కోర్టు భవనం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వస్తున్న క్రమంలో రహదారిని వెంటనే పునరుద్ధరించాలని స్థానిక మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం దేవరాయాంజాల్ గ్రామంలోని వరద కాలువ ఆక్రమణలను పరిశీలించారు.
Hydraa CHief AV Ranganath Key Comments
తుర్కవాణి కుంట నుంచి దేవరాయాంజాల్ చెరువుకు వెళ్లే వరద కాలువ కబ్జా కావడంతో 4 కాలనీలు నీట మునుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేసారు. గ్రామ రికార్డ్స్, సర్వే ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ఎస్సీ మ్యాపుల ఆధారంగా గతంలో ఎంత విస్తీర్ణంలో ఉండేదో చూసి ఆక్రమణలు తొలగించి వరద కాలువను పునరుద్ధరించాలని రంగనాథ్ ఆదేశించారు. తర్వాత తూముకుంట లోని వాసవి సుచిర్ ఇండియా లేపుట్లో నాలా కుంచించుకు పోవడాన్ని పరిశీలించారు. దేవరాయాంజాల్ చెరువు, పోతాయిపల్లి చెరువు నుంచి గుండ్లకుంట చెరువుకు వెళ్లే వరద కాలువ వాస్తవ వెడల్పు కొనసాగించకుండా నిర్మించడాన్ని పరిశీలించారు. 9 మీటర్ల వెడల్పుతో ఉండాల్సిన నాలా 2 మీటర్లకే పరిమితం చేయడం వల్ల అదే వెంచర్లోని ప్లాట్లతో పాటు పై భాగంలో ఉన్న నివాసాలు కూడా మునిగి పోతున్నాయని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల వర్షాలకు నీట మునిగిన వీడియోలు చూపించారు. ఓపెన్ నాల ఉండాల్సిన చోట పైపులు వేయడంతో ఈ సమస్య తలెత్తిందని అధికారులు చెప్పారు.
Also Read : AP Growth : రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు 11వ ఎస్ఐపీబీ ఆమోదం


















