Sundeep Kishan: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి ‘మజాకా’ అనే టైటిల్ ఖరారైంది. ఏకే ఎంటర్టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేష్ దండా ఈ సినిమా నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా టైటిల్ ని ప్రకటించి, ఫస్ట్‌లుక్ ని విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Sundeep Kishan Movie Updates
‘‘మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘మజాకా’. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీగా అలరిస్తుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. రావు రమేశ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా బాలాజీ గుత్తా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో దనుష్ ‘రాయన్’ సినిమా నటించిన సందీప్ కిషన్… మంచి మార్కులు సంపాదించుకున్నారు. అటు తమిళం, ఇటు తెలుగులోనూ గుర్తింపు పొందడంతో ‘మజాకా’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
Also Read : Director Sankar: తన సన్నివేశాలను కాపీకొడుతున్నారంటున్న డైరెక్టర్ శంకర్ ! ‘దేవర’ గురించేనా ?