Vijay Deverakonda : హైదరాబాద్ : గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్న హీరో హీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఒక్కటి కాబోతున్నారు త్వరలో. ఈ ఇద్దరు కలిసి ఏడడుగులు వేయ బోతున్నారు. పెద్దల సమక్షంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నివాసంలో ఇరు కుటుంబాల సాక్షిగా నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కొంత కాలంగా ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆపై చెట్టా పట్టాల్ వేసుకుని తిరిగారు. షికార్లు చేశారు. వచ్చే ఏడాది 2026 ఫిబ్రవరి నెలాఖరులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల వివాహం జరుగుతుందని కుటుంబీకులు అధికారికంగా ప్రకటించారు.
Vijay Deverakonda-Rashmika Mandanna Engagement
ఇక ఈ ఇద్దరూ కలిసి సినిమాలలో నటించారు. తొలుత డియర్ కామ్రేడ్, ఆ తర్వాత గీత గోవిందంలో కీ రోల్స్ పోషించారు. గీత గోవిందం ద్వారా ఈ ఇద్దరు తెలుగు వారికి మరింత దగ్గరయ్యారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. రష్మిక మందన్నా నేషనల్ క్రష్ గా మారారు. పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు. తను అల్లు అర్జున్ తో కలిసి నటించిన పుష్ప -1, పుష్ప -2 మూవీస్ ఇండియాను , వరల్డ్ ను షేక్ చేశాయి. హిందీలో తాను నటించిన యానిమల్ రికార్డ్ బ్రేక్ చేసింది. ఛత్రపతి శివాజీ తనయుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన మూవీ ఛాయ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తో సికిందర్ లో నటించింది. ఇక విజయ్ కి ఈ ఏడాది సక్సెస్ వచ్చింది. తను బోర్సేత కలిసి నటించిన డెకాయిట్ ఆశించిన మేర విజయవంతమైంది. మొత్తంగా ఈ ఇద్దరు ఒక్కటి కాబోతుండడం విశేషం.
Also Read : Sanjay Malhotra- RBI Growth : అశాంతమైన ప్రపంచంలో భారత్ స్థిరత్వానికి నాంది: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా



















