Gold : సాధారణ కొనుగోలుదారులుతో పాటు పరిశ్రమ వర్గాల నుంచి కూడా డిమాండ్ పెరగడమే బంగారం, వెండి ధరల్లో ఈ భారీ లాభానికి ప్రధాన కారణం అని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.
Gold – ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
- ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,16,560; 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,06,860
- ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,16,410; 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,06,710
- చెన్నై, బెంగళూరు: 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,16,740; 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,07,010
- హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,16,410; 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,06,710
పెట్టుబడిదారుల లాభాలు
ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం (Gold), వెండి పెట్టుబడిదారులకు మంచి లాభాలను అందించాయి. గత ఏడాది డిసెంబర్ 31 నాటి ధరలతో పోలిస్తే:
- 10 గ్రాముల బంగారంపై రూ.40,550 లాభం
- కిలో వెండిపై రూ.60,300 లాభం
ఇక దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు, సెన్సెక్స్, నిఫ్టీలు తగిన లాభాలు ఇవ్వకపోవడం వలన పెట్టుబడిదారుల దృష్టి బులియన్ మార్కెట్‌పై కేంద్రీకృతమైంది.
అంతర్జాతీయ మరియు ఫ్యూచర్స్ మార్కెట్ ప్రభావం
వెండి ధరలో అనూహ్యంగా పెరుగుదల చోటు చేసుకోవడం అంతర్జాతీయ మార్కెట్లలోనూ కనిపిస్తుంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో అక్టోబర్, డిసెంబర్ కాంట్రాక్టులు భారీ లాభాలతో ట్రేడవుతూ కొత్త రికార్డులు సృష్టించాయి.
మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం ప్రకారం, బంగారం, వెండి పెట్టుబడులు ఈ సమయంలో పెట్టుబడిదారులకు అత్యంత ఆకర్షణీయంగా మారాయి.
Also Read : Stock Market Growth : ఆర్బీఐ రెపో రేటుతో లాభాల్లోకి వచ్చిన సూచీలు



















