Big Boss 9 : హైదరాబాద్ : బుల్లితెరపై సందడి చేస్తోంది బిగ్ బాస్ -9 (Big Boss 9) రియాల్టీ షో. ఇప్పటికే పలువురు పోటా పోటీగా పార్టిసిపేట్ చేస్తున్నారు. తమదైన శైలిలో ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేయడంతో షో రోజు రోజుకు మరింత రక్తిని కట్టిస్తోంది. ఆదరణ పొందుతోంది. ఇక తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు చిన్న చిన్న పాత్రలతో అలరించాడు. ప్రతి ఒక్కరి మనసు దోచుకున్నాడు. తను గతంలో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం చేసిన సినిమా జయం. ఇది బిగ్ సక్సెస్ అయ్యింది. సుమన్ శెట్టిని తనే సినీ రంగానికి పరిచయం చేశాడు. అందుకే తనకు గుర్తుగా కట్టుకున్న ఇంట్లో ఒక గదిని తన కోసం కేటాయించడం విశేషం. రోజు రోజుకు తను బిగ్ బాస్ -9 రియాల్టీ షోలో టాప్ లోకి దూసుకు పోతున్నాడు. ఇది ప్రతి ఒక్కరిని విస్తు పోయేలా చేసింది. దీనిని జియో మాట్ స్టార్ టెలికాస్ట్ చేస్తోంది.
Big Boss 9 – Suman Shetty Sensational
రోజు రోజుకు తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ప్రధానంగా తనకు వీక్షకుల నుండి ఓట్లు అతనికి చాలా మద్దతు ఇస్తున్నాయి. ఇదిలా ఉండగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమై మూడు వారాలు అయింది, కాగా హౌస్ లో మూడు ఎలిమినేషన్లు జరిగాయి. ఇప్పటి వరకు, శ్రాస్తి వర్మ, మనీష్ మరండా , ప్రియా శెట్టి షో నుండి ఎలిమినేట్ అయ్యారు. జయం ఫేమ్ సుమన్ శెట్టి అత్యంత ప్రజాదరణ పొందిన పోటీదారులలో ఒకరిగా నిలిచారు. బిగ్ బాస్ తెలుగు 9 లో అత్యధిక పారితోషికం తీసుకునే పోటీదారుడు ఆయనే అని ప్రచారం జరుగుతోంది పెద్ద ఎత్తున. తాజా నివేదికల ప్రకారం ఈ రియాల్టీ షోలో పాల్గొన్నందుకు సుమన్ శెట్టికి నిర్వాహకులు వారానికి రూ. 3 లక్షలు పారితోషికం ఇస్తున్నట్లు తెలిసింది. తను ఆడుతున్న తీరు ప్రతి ఒక్కరిని తనను అభిమానించేలా చేస్తోంది.
Also Read : TTD Brahmotsavams Interesting : ఆధ్యాత్మిక ఉత్సవం సాంస్కృతిక సౌరభం



















