Movie : హైదరాబాద్ : హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా ఇదే చివరి రోజు. ఆయన స్థానంలో ఇవాళ కొత్తగా సిటీ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు ఇప్పటి వరకు తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న వీసీ సజ్జనార్. ఇక ఇప్పటి వరకు సీపీగా విధులు నిర్వహించిన సీవీ ఆనంద్ కలకంగా వ్యవహరించాడు. అంతే కాదు ఆయన దేశ వ్యాప్తంగా భారతీయ సినిమా రంగానికి చెందిన అతి పెద్ద పైరసీ భూతం లొసుగులను బయటకు లాగాడు. అంతే కాదు దాని వెనుక ఎవరు ఉన్నారనేది బహిర్గతం చేశాడు. ఇందుకు సంబంధించిన సీవీ ఆనంద్ వెల్లడించిన వివరాలు విస్తు పోయేలా చేశాయి.
Hyderabad Movie Piracy Sensational
ఈ సందర్బంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత జూన్ నెల నుండి సైబర్ క్రైమ్ బృందాలు సినిమా పైరసీ కేసులో దేశ వ్యాప్తంగా నిందితులను వెంబడించి కొంతమంది పైరేట్స్ ను అరెస్టు చేశామన్నారు. విచారణలో విడుదలకి ముందే సినిమాలు ఎలా బయటికి పైరసీ అవుతున్నాయి అనే విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. .హెచ్ డీ మూవీస్ పైరసీ కేసు ఛేదించడం దేశంలో ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. మొత్తంగా 2023లో సినిమా పరిశ్రమకు పైరసీ కారణంగా రూ.22,400 కోట్ల వరకు నష్టం ఏర్పడినట్లు అంచనా ఉందన్నారు సీవీ ఆనంద్. కేవలం ఒక్క తెలుగు సినిమా పరిశ్రమకే సుమారు రూ.3,700 కోట్లు నష్టం వచ్చిందని పేరర్కొంటున్నారు సినీ వర్గాలు.
ప్రజలు సినిమాలను త్వరగా చూడాలనుకుంటారు. ఆ డిమాండ్‌నే ఆసరాగా తీసుకొని సినిమా పైరసీకి మార్కెట్ ఏర్పడుతోందని చెప్పారు. ఈ పైరేటెడ్ సినిమాలు టోరెంట్ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ చానెల్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై హోస్ట్ చేయబడుతున్నాయని గుర్తించామన్నారు.
Also Read : Hero Chiranjeevi – OG Movie : పవన్ కళ్యాణ్ ఓజీని చూసిన మెగాస్టార్


















