Rani Mukerji : ముంబై : జాతీయ స్థాయిలో ఉత్తమ నటి పురస్కారం అందుకుంది ప్రముఖ బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ. ఈ సందర్బంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పింది. కాక పోతే మరిన్ని పురస్కారాలు తాను అందుకోవాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని పేర్కొంది. మరిన్ని జాతీయ అవార్డులు గెలుచు కోవాలన్నది తన అభిమతమని పేర్కొంది. మనిషి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఉంటుందని తెలిపింది. ఇక సినిమా రంగంలో ఎందరో ప్రతిభావంతులైన కళాకారులు ఉన్నారని చెప్పింది. ఇందులో ఎవరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భావన ఉండదన్నారు. తాను ప్రస్తుతం మర్దానీ మూవీలలో నటిస్తోంది. కీలకపాత్ర పోషిస్తోంది. ఈ సందర్బంగా ఈ మూవీ వచ్చే ఏడాది 2026లో రానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది.
Rani Mukerji Comments
దాదాపు మూడు దశాబ్దాల కెరీర్‌లో తన మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నందుకు నటి రాణి ముఖర్జీ (Rani Mukerji) సంతోషం వ్యక్తం చేసింది. 46 ఏళ్ల ఆమె ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మాట్లాడారు. తన మనసులోని భావాలను పంచుకున్నారు. 1996లో నా సినీ కెరీర్ మొదలైందని ఆనాటి నుంచి నేటి దాకా 30 ఏళ్లుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతోందని చెప్పారు రాణి ముఖర్జీ. ఇన్నేళ్లు ఎలా గడిచాయో చూస్తే , తలుచుకుంటే ఆనందంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా తను తొలి చిత్రం బియర్ పూల్ ఇది బెంగాలీ చిత్రం. బాలీవుడ్ లో కుచ్ కుచ్ హోతా హై, గులాం, చల్తే చల్తే సాథియా, హమ్ తుమ్, బ్లాక్, మర్దానీ, హిచ్కీ వంటి బ్లాక్ బస్టర్ హిందీ చిత్రాలలో నటించింది. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ద్రౌపది ముర్ము మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వ చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ నటి అవార్డును ప్రదానం చేశారు.
Also Read : Ladakh Curfew Sensational : వాంగ్‌చుక్ అరెస్ట్ ఎఫెక్ట్ లేహ్ లో కర్ఫ్యూ


















