Ladakh : లడఖ్ : లడఖ్ కు ప్రత్యేక హోదా కావాలని గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో మరింత నిరసనలు వ్యక్తం అయ్యాయి. లేహ్‌లో కర్ఫ్యూ కొనసాగుతోంది. సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు , పారా మిలిటరీ దళాల పెట్రోలింగ్ , తనిఖీలను ముమ్మరం చేశారు. .లేహ్, లడఖ్‌లో (Ladakh) కర్ఫ్యూ మధ్య భద్రతా సిబ్బంది పెద్ద ఎత్తున వీధుల్లో గస్తీ నిర్వహించారు. హింసకు గురైన లేహ్ పట్టణంలో శనివారం నాల్గవ రోజు కర్ఫ్యూ అమలులో కొనసాగుతోంది. జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను మునుపటి రోజు అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు, పారామిలిటరీ దళాలు గస్తీ తిరుగుతున్నాయి.
Ladakh Sensational
లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని పరిపాలన వాంగ్‌చుక్ నిర్బంధాన్ని సమర్థించింది. తను రెచ్చగొట్టేలా ప్రసంగించడంతోనే లేఫ్ , లడఖ్ ప్రాంతాలలో ఆందోళనలకు దారి తీశాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరో వైపు భారతీయ జనతా పార్టీ కి చెందిన కార్యాలయానికి నిప్పు పెట్టారు లడఖ్ లో. ప్రజా శాంతి భద్రతల నిర్వహణకు పక్షపాతం కలిగించే విధంగా వాంగ్ చుక్ వ్యవహరించకుండా నిరోధించడానికి గాను వాంగ్ చుక్ ను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా త్వరలో రాజ్ భవన్‌లో ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు.
Also Read : Telangana Govt Important Update : జిల్లాల వారీగా జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లు

















