Nagarjuna : న్యూఢిల్లీ : ప్రముఖ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు (Nagarjuna) భారీ ఊరట లభించింది. తాజాగా వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం తను దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోర్న్ సైట్‌లు, వస్తువులు, యూట్యూబ్ వీడియోలలో తన చిత్రాన్ని దుర్వినియోగం చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్ం చేశారు. ఈ మేరకు వాటిపై చర్య తీసుకోవాలని కోరారు. ఇదే సమయంలో గతంలో ప్రముఖ బాలీవుడ్ నటీ నటులు ఐశ్వర్య బచ్చన్, అభిషేక్ బచ్చన్, కరణ్ జోహార్‌లకు కూడా ఇలాంటి ఉపశమనం లభించింది. తన వ్యక్తిత్వం, ప్రచార హక్కులను కాపాడు కోవాలని అక్కినేని నాగార్జున భావించారు. ఆ మేరకు దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ఢిల్లీ హైకోర్టు గురువారం తెలిపింది.
Nagarjuna Gets Relief from Delhi Court
ఈ పిటిషన్ జస్టిస్ తేజస్ కరియా ముందు విచారణకు వచ్చింది, ఈ విషయంలో తాను ఉత్తర్వులు జారీ చేస్తానని ఆయన చెప్పారు. మీరు యుఆర్ఎల్ లను గుర్తించగ గలిగినప్పుడు, వెంటనే నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేశారు. చాలా మంది నటీ నటులు ఇలాంటివి చాలా ఎదుర్కొంటున్నారు. కొన్నేళ్ల నుంచి సతమతం అవుతూ వస్తున్నారు. కొందరు కోర్టును ఆశ్రయిస్తే, మరికొందరు మౌనంగా తమకెందుకని మౌనంగా భరిస్తున్నారు. కాగా పిటిషన్లు దాఖలు చేసిన వారికి కోర్టు వారికి ఇలాంటి ఉపశమనం ఇచ్చింది. నాగార్జున తరపున న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ వాదించారు. వచ్చే జనవరి 23న ఈ కేసును తదుపరి విచారణకు జాబితా చేసింది.
Also Read : Guruvayur Krishna Interesting : శ్రీకృష్ణడి అలంకారంలో శ్రీ మలయప్ప దర్శనం


















