Andaman Sea Oil : దేశీయ చమురు, సహజ వాయువు ఉత్పత్తి పెంచి దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) అండమాన్, నికోబార్ ద్వీపాలు, మహానది, సౌరాష్ట్ర, బెంగాల్ బేసిన్స్లలో వచ్చే ఏడాదిలో కొత్త బావులు తవ్వనున్నారు.
Andaman Sea Oil – అండమాన్‌లో భారీ నిక్షేపాల అంచనా
అండమాన్‌కు సమీపంలోని మయన్మార్, ఇండోనేషియా సముద్ర జలాల్లో ఇప్పటికే విస్తారమైన చమురు, గ్యాస్ నిక్షేపాలు (Andaman Sea Oil) గుర్తించబడ్డాయి. భౌగోళికంగా ఈ ప్రాంతం కూడా అదే తరహా లక్షణాలను కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో భారత ఇంధన పటాన్ని మార్చగల 37.1 కోట్ల టన్నుల వరకు నిక్షేపాలు ఇక్కడ ఉండే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. గతేడాది దేశం దిగుమతి చేసుకున్న 24.24 కోట్ల టన్నుల కంటే 7.46 కోట్ల టన్నులు ఎక్కువగా ఇవి ఉంటాయని అధికారిక నివేదికలు సూచిస్తున్నాయి.
పెట్టుబడులు, అనుమతులు
ఈ ప్రాజెక్టుల కోసం కేంద్రం ₹3,200 కోట్ల పెట్టుబడులకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే 2022లో అండమాన్ సముద్రంలోని దాదాపు 10 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని స్వేచ్ఛా మండలంగా ప్రకటించారు.
బీపీ భాగస్వామ్యం
అండమాన్‌లో తవ్వకాల ప్రణాళికలో బ్రిటిష్ పెట్రోలియం (BP) కూడా భాగస్వామ్యం కానుంది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాతో కలిసి పరీక్షా బావులు తవ్వి ఫలితాలను విశ్లేషించనుంది. పరీక్షలు విజయవంతమైతే ఉత్పత్తి హక్కుల్లో బీపీకి కూడా వాటా లభించే అవకాశం ఉంది.
సవాళ్లు
అయితే పర్యావరణ అనుమతులు, భారీ ఖర్చులు ఈ ప్రాజెక్టుకు ప్రధాన సవాళ్లుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : Stock Market Sensational : నేడు నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్



















