Pawan Kalyan : చిత్తూరు జిల్లా : ఎవరూ ఊహించని విధంగా సామాన్య జనసేన నాయకుడికి ఊహించని గుర్తింపు దక్కింది. తాను ఇచ్చిన మాట ప్రకారం ఆ పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రతిపాదించారు. తనకు కీలకమైన ఆలయ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొట్టే సాయి ప్రసాద్ రెడ్డిని తీవ్రంగా అవమానించారు. అయినా ఆ వేధింపులను తట్టుకుని నిలబడ్డాడు రెడ్డి. ఈ సందర్బంగా తాజాగా కీలకమైన చిత్తూరు జిల్లాలోని ప్రసిద్దమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా కొట్టే సాయి ప్రసాద్ రెడ్డిని (Kotte Sai Prasad Reddy) నియమించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఓకే చెప్పారు. ఈ సందర్బంగా తనపై నమ్మకం ఉంచి చైర్మన్ గా నియమించినందుకు వవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు చెప్పారు రెడ్డి.
AP Deputy CM Pawan Kalyan Comments
ఇదిలా ఉండగా జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి పవన్ కళ్యాణ్ గారి బాటలో నడిచాడు . తన స్వస్థలం శ్రీకాళహస్తి. పవన్ ప్రతిపాదన ప్రతి ఒక్కరిని విస్తు పోయేలా చేసింది. ఇందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం సాయి ప్రసాద్ పేరును ప్రకటించింది. 2023లో శ్రీకాళహస్తిలో జనసేన పక్షాన ప్రజాస్వామ్యయుతంగా నిరసన కార్యక్రమం చేపట్టిన కార్యకర్తలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఆ సందర్భంలో కొట్టే సాయిప్రసాద్ రెడ్డిపై అప్పటి సీఐ అంజు యాదవ్ దాడి చేసి అవమానించారు. ఆమె కొడుతున్నా కదలకుండా అలాగే నిలుచుండి పోయారు. ఆ ఘటన జరిగిన రోజున తాడేపల్లిగూడెం సమావేశంలో ఉన్న పవన్ కళ్యాణ్ తక్షణం స్పందించారు. ఆ తరవాత కొట్టే సాయిని, నాయకులను వెంట బెట్టుకొని తిరుపతి వెళ్ళి జిల్లా ఎస్పీని కలిసి పోలీసుల చర్యపై ఫిర్యాదు చేశారు.
పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిలిచిన కొట్టే సాయిని పవన్ కళ్యాణ్ గుర్తించి నేడు గౌరవ ప్రదమైన బాధ్యతలు అప్పగించారు. పార్టీ కోసం నిలిచే కార్యకర్తలు, నాయకులను గుర్తించి తగిన బాధ్యతలు ఇచ్చే దిశగా పార్టీ చీఫ్ నిర్ణయాలు తీసుకుంటున్నారనే దానికి ఈ నిర్ణయం ఓ ఉదాహరణ.
Also Read : Pawan Kalyan Important Comments : ప్లాస్టిక్ రహితంగా ఏపీ మారాలి : పవన్ కళ్యాణ్
















