Robo Shankar : చెన్నై : తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు రోబో శంకర్ (Robo Shankar) కన్ను మూశారు. ఆయన వయసు 46 ఏళ్లు. చెన్నైలో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న తను ఉన్నట్టుండి స్పృహతప్పి పడి పోయారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. నిన్న అర్ధరాత్రి తను తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తను రోబో లాగా డ్యాన్స్ చేయడంతో రోబో శంకర్ గా గుర్తింపు పొందారు.
Robo Shankar No More
ఇదిలా ఉండగా ఎన్నో హాస్య పాత్రలలో నటించి మెప్పించాడు రోబో శంకర్ (Robo Shankar). ఐసీయూకు తరలించినా ఫలితం లేక పోయింది. రక్తపోటులో హెచ్చు తగ్గుదల కారణంగా తనను కాపాడలేక పోయామని వైద్యులు వెల్లడించారు. రోబో శంకర్ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ నటుడు, ఎంపీ కమల్ హాసన్. ఆయనకు హృదయ పూర్వకమైన నివాళి అర్పించారు. రోబో అనేది ఒక మారుపేరు. నా నిఘంటువులో, నువ్వు ఒక మనిషివి. నువ్వు నా తమ్ముడివి. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపోయావు. నా పని అసంపూర్ణంగానే ఉంది. రేపు నువ్వు మన కోసం వెళ్ళిపోయావు. కాబట్టి, రేపు మనది అంటూ భావోద్వేగంతో ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
రోబో శంకర్ కు కమల్ హాసన్ అంటే పంచ ప్రాణం. తను షూటింగ్ లో పాల్గొనే ముందు ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకునేవాడు రోబో శంకర్. రోబో శంకర్ మృతదేహాన్ని చెన్నైలోని వలసరవక్కంలోని అతని ఇంటికి తరలించారు. శుక్రవారం నగరంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన భార్య-నటి ప్రియాంక రోబో శంకర్, కుమార్తె ఇంద్రజ శంకర్ ఉన్నారు. బుల్లితెరతో పాటు వెండి తెరపై కూడా తాను నటుడిగా నిరూపించుకున్నాడు.
వృత్తి పరంగా రోబో శంకర్ 1997 నుండి సినిమాల్లో పనిచేస్తున్నాడు. సహాయ పాత్రల్లో కనిపించడానికి ముందు రజనీకాంత్ పడయప్పతో సహా తమిళ చిత్రాలలో వరుస గుర్తింపు లేని పాత్రలు పోషించాడు. విజయ్ సేతుపతి ఇదర్కుతనే ఆసైపట్టై బాలకుమారలో తన నటనతో మరింత పేరు వచ్చేలా చేసింది.
Also Read : APTDC Special Package Interesting : నవరాత్రుల కోసం ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీ


















