Teenmar Mallanna : హైదరాబాద్ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) అలియాస్ చింతపండు నవీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను శాసన మండలి సభ్యుడి పదవికి రాజీనామా చేయాలంటూ వస్తున్న డిమాండ్లపై తీవ్రంగా స్పందించారు. తన పదవిపై ప్రజా రిఫరెండం కోరుతున్నానని ప్రకటించారు. ఎమ్మెల్సీగా తాను సరిగ్గా పని చేయలేదని చెబితే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. బీసీ వర్గాల కోసం చట్ట సభలో ఉండి పోరాడాలని చెబితే ఎమ్మెల్సీగా కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా అని గతంలో చాలా మంది అన్నారంటూ మండిపడ్డారు. టికెట్ల కోసం గాంధీ భవన్ వద్ద, తెలంగాణ భవన్ వద్ద, బీజేపీ రాష్ట్ర ఆఫీసు వద్ద బి ఫారంల కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేదన్నారు.
Teenmar Mallanna Slams
హైదరాబాద్ వేదికగా ఫైవ్ స్టార్ తాజ్ హోటల్ లో ఎమ్మల్సీ తీన్మార్ మల్లన్న సారథ్యంలో కొత్తగా పార్టీని ప్రకటించారు. దీనికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అని నామకరణం చేశారు. ఇది అన్ని రాజకీయ పార్టీల లాంటిది కాదని అన్నారు ఈ సందర్బంగా మల్లన్న. గత 79 ఏళ్ల నుంచి బీసీలు, బహుజనులు, అణగారిన వర్గాలు మోస పోతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా బీసీ బిడ్డనేనని, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో పూర్తిగా అన్యాయం జరిగిందని ఆరోపించారు. 80 శాతానికి పైగా ఉన్న బీసీలను కేవలం 50 శాతానికే పరిమితం చేయడం దారుణమన్నారు. ఇవాళ రాష్ట్రంలో బీసీలకు ఒక బలమైన వేదిక తెలంగాణ రాజ్యాధికార పార్టీ గా మార బోతోందన్నారు తీన్మార్ మల్లన్న.
Also Read : Jammu and Kashmir Sensational : కతువా జిల్లాలో సెక్యూరిటీ ఫోర్సుల సెర్చ్ ఆపరేషన్

















