Gaddam Prasad : హైదరాబాద్ : సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు సమీపిస్తుండడంతో పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలు నానా తంటాలు పడుతున్నారు. తాజాగా తమకు స్పీకర్ ఇచ్చిన నోటీసులకు స్పందించారు. ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు అందులో. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కండువా కప్పుతున్నప్పుడు.. తిరస్కరించడం సంస్కారం కాదనే భావనతో కండువా కప్పుకున్నామే తప్పా కావాలని తాము పార్టీ మారలేదంటూ పేర్కొన్నారు. ఇంకా భారత రాష్ట్ర సమితి పార్టీలోనే కొనసాగుతున్నామని, కానీ ఆ పార్టీకి చెందిన వారు తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వాపోయారు. ఇదిలా ఉండగా శుక్రవారం స్పీకర్ (Gaddam Prasad) కు ఇచ్చిన సంజాయిషీ లేఖలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
Speaker Gaddam Prasad Shocking Comments
కాగా 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సర్వోన్నత న్యాయస్థానం సూచించిన నేపథ్యంలో వీరి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు స్పీకర్. స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరెకపూడి గాంధీ, సంజయ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. కాగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం సమాధానం ఇవ్వడానిక తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్‌ను కోరినట్లు సమాచారం.
Also Read : YS Sharmila Shocking Comments : నా కొడుకుని చూసి వైసీపీ భయపడుతోంది : షర్మిల

















