YS Sharmila : అమరావతి : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆమె వైఎస్సార్సీపీని ఏకి పారేశారు. తన కొడుకు వైఎస్ రాజారెడ్డి గురించి ఎందుకంతగా స్పందిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. శుక్రవారం షర్మిల (YS Sharmila) మీడియాతో మాట్లాడారు. నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టలేదని, అప్పుడే రియాక్ట్ కావడం విస్తు పోయేలా చేసిందన్నారు. తన కొడుకు రాజా రెడ్డి అంటే ఎందుకంత భయం అని ప్రశ్నించారు షర్మిలా రెడ్డి. YCP ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే..? ఇది భయమా ? బెదురా ? వాళ్ళకే తెలియాలంటూ ఎద్దేవా చేశారు.
YS Sharmila Slams YSRCP
రాజారెడ్డి అని నా కొడుకుకి స్వయంగా తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారని చెప్పారు. నాకొడుకు ముమ్మాటికీ రాజశేఖర్ రెడ్డి వారసుడు అని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు చెప్తే నా కొడుకు వస్తున్నాడని చెప్పడం వారి అవివేకానికి నిదర్శనం అని మండిపడ్డారు షర్మిలా రెడ్డి. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. నా కొడుకుని చంద్రబాబు చెప్పాడని తీసుకువస్తే..మరి ఎవరు చెప్పారని ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో RSS వాదికి మద్దతు ఇచ్చారంటూ నిలదీశారు. దీనికి వైసీపీ బాస్ , మాజీ సీఎం జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
టీడీపీ, జనసేన పార్టీలది బహిరంగ పొత్తు అయితే జగన్ ది తెర వెనుక పొత్తు అని ఎద్దేవా చేశారు. తను రాజకీయ వ్యభిచారం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : VP CP Radhakrishnan Success : ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
















