IMD : హైదరాబాద్ : ఇప్పటికే అటు ఏపీలో వర్షాల తాకిడి కొనసాగుతుండగా తాజాగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ సర్కార్ కు సూచన చేసింది. రాబోయే ఏడు రోజుల పాటు భారీగా వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అనేక జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని , బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. మంగళవారం నుండి సెప్టెంబర్ 16 వరకు వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తాయని అంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని, మరికొన్ని చోట్ల బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఐఎండీ (IMD).
IMD Heavy Rains Warning to Telangana
బుధవారం వరకు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ , నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది . గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అంతే కాకుండా 11వ తేదీ వరకు ఆదిలాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఈనెల 3వ రోజు 12వ తేదీ వరకు కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ (IMD) హెచ్చరించింది. హైదరాబాద్‌తో పాటు దాని పక్కనే ఉన్న రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో కూడా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. 13వ తేదీ వరకు నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
కాగా 14వ తేదీ వరకు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట ప్రాంతాల్లో ఐఎండీ (IMD) విస్తృత హెచ్చరికలు జారీ చేసింది. 6వ రోజు 15వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. 7వ రోజు 16వ తేదీ వరకు వర్షపాతం తగ్గుతుందని, రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది భారత వాతావరణ శాఖ.
Also Read : Vijay-Sangeetha Divorce Rumor Sensational : దళపతి విజయ్ సంగీత విడి పోనున్నారా..?
















