Minister Subramanian : చెన్నై : తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ (Minister Subramanian) సీరియస్ అయ్యారు. చెన్నై ఎయిర్ పోర్టులో కనీస వసతులు కూడా లేకుండా పోయాయని వాపోయారు. ఎయిర్ బస్ విస్తరణ, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. మధురై, టుటికోరిన్ వంటి దేశీయ మార్గాల్లో ఎయిర్‌బస్ విమానాలను అనుమతించాలని కోరారు. సీనియర్ సిటిజన్లు, పిల్లలకు ఇబ్బందులను పేర్కొంటూ చెన్నై విమానాశ్రయంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఏటీఆర్ విమానాలకు బదులుగా ఎయిర్ బస్ ఫ్లైట్స్ ను నడిపించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు కేంద్రాన్ని మంత్రి .
Minister Subramanian Shocking Comments
మధురై, కోయంబత్తూర్ వంటి గమ్యస్థానాలకు ప్రయాణించే ప్రయాణికులు తరచుగా సీటింగ్ సరిపోక పోవడం వల్ల షటిల్ బస్సులలో నిలబడవలసి వస్తుందని సుబ్రమణియన్ అన్నారు. విమానయాన సంస్థలు నడిపే బస్సులు, 1,301 ఎకరాల విమానాశ్రయంలో చాలా దూరంలో ఉన్న బేలలో నిలిపి ఉంచిన విమానాలకు ప్రయాణికులను తీసుకెళుతున్నాయని వాపోయారు. ఈ షటిల్ సర్వీసులలో తక్కువ సీట్లు ఉన్నందున, సీనియర్ సిటిజన్లు, పిల్లలు విమానాలను దూరంగా నిలిపి ఉంచడం వల్ల ఎక్కువసేపు నిలబడటానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మా సుబ్రమణియన్ మీడియాతో మాట్లాడారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
Also Read : Nirmala Sitharaman Strong Response : జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ఆర్థిక వ్యవస్థ పెరుగుదల పై స్పందించిన కేంద్రం















