IMD : అమరావతి : ఏపీలో భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీ ఐఎండీ) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ముందస్తుగా ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. ఆదివారం కీలక ప్రకటన చేశారు. వాయువ్య బంగాళాఖాతం దక్షిణ ఒడిశా , ఉత్తర తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌కు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 , 5.8 కి.మీ మధ్య ఎగువ వాయు తుఫాను నెలకొని ఉందని వెల్లడించారు. దీని కారణంగా ఉత్తర తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఉరుములతో కూడిన వర్షంతో పాటు మెరుపులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
IMD Shocking Update on AP Rains
ఆదివారం ఇదే ప్రాంతంలోని కొన్ని ప్రదేశాలలో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ (IMD) ఎండీ ముందస్తుగా హెచ్చరించారు. సోమ, మంగళవారాలలలో ఉత్తర , దక్షిణ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలలో మెరుపులతో కూడిన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, అదే ప్రాంతాలలో 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేశారు ప్రఖర్ జైన్. ఇదే సమయంలో 40 కిలోమీటర్ల మేర బలంగా గాలులతో పాటు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఎండీ. అవసరమైతే తప్పా బయటకు రావద్దని, మత్స్య కారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
Also Read : Aryna Sabalenka Growth : సబలెంకా యుఎస్ ఓపెన్ టైటిల్ విజేత

















