Sridhar Babu : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తోందని స్పష్టం చేశారు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu). పెద్ద ఎత్తున కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భావితరాల అవసరాలకు అను గుణంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం జరిగిందని చెప్పారు. భారీ ఎత్తున నిర్మించ బోయే ఈ ఫ్యూచర్ సిటీలో ఐటీ, ఫార్మా, లాజిస్టిక్, తదితర రంగాలకు చెందిన కంపెనీలు ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు.
Minister Sridhar Babu Comments
ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఫ్రెంచ్ కంపెనీలను ప్రోత్సహించాలని ఇండో – ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ (ఇ ఫ్కీ) ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. హైదరాబాద్ లో సెక్రటేరియట్ ఇఫ్కీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలు, ప్రభుత్వ తరఫున అందిస్తున్న ప్రోత్సాహాకాలను ఆయన వివరించారు.
ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడారు. తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేయాలనే దూరదృష్టి తోనే సీఎం రేవంత్ రెడ్డి 30 వేల ఎకరాల్లో పీపీపీ విధానంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన్నట్లు చెప్పారు. ఏడాదిన్నర వ్యవధిలోనే తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల పెట్టబడులు వచ్చాయని వెల్లడించారు. గతేడాది హైదరాబాద్ లో 70 జీసీసీలు ప్రారంభమైనట్లు తెలిపారు. పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శ నం అని స్పష్టం చేశారు. పరిశ్రమలకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సమా వేశంలో ఇఫ్కీ నుంచి యోహాన్ సామ్యూల్, పలు ఫ్రెంచ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read : Adani Group Profitable : అమాంతం పెరిగిన అదానీ కంపెనీ షేర్లు
















