CM Chandrababu : అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. గుంటూరు జిల్లా తురకపాలెంలో చోటు చేసుకున్న వరుస మరణాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైతే కేంద్ర వైద్య బృందాలు, ఎయిమ్స్ బృందాలను రప్పించాలని ఆదేశించారు. అందరి హెల్త్ ప్రొఫైల్స్‌ను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు చేయాలని, కొత్త కేసులు నమోదు కాకూడదని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు (CM Chandrababu). అందరిలో నమ్మకం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు సూచించారు.
CM Chandrababu Announced
వీలైతే ప్రత్యేకంగా వైద్య బృందాలను పంపించాలని పేర్కొన్నారు సీఎం. సోమవారంలోపు అందరి హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తురక పాలెం గ్రామంలోని ప్రజలంతా ప్రస్తుతం పూర్తిగా భయాందోళనలో చిక్కుకు పోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఏ మహమ్మారి ప్రభావం ఉందో తెలియక తల్లడిల్లితున్నారు. ఇప్పటి వరకు ఊరికి చెందిన వారు 30 మందికి పైగా మృతి చెందారు. దీనికి సంబంధించి ఆందోళన మరింత ఎక్కువై పోయింది. తురకపాలెంలో మరణ మృదంగం కొనసాగుతున్నా ఎందుకుని టీడీపీ సర్కార్ ఇప్పటి వరకు స్పందించ లేక పోయిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఆమె నిప్పులు చెరిగాక స్పందించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పటి వరకు దీనిపై ఎందుకు నోరు మెదప లేదంటూ ఆమె వైద్య ఆరోగ్య శాఖను, మంత్రి సత్య కుమార్ యాదవ్ ను ప్రశ్నించారు.
Also Read : CPI Narayana Fired on All Parties : గల్లీలో గుద్దులాట ఢిల్లీలో ముద్దులాట















