K. K. Senthil Kumar: కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్ సిద్ధార్ద్… మరో పాన్ ఇండియా ప్రాజెక్టు ‘స్వయంభూ’ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమౌతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా… నిఖిల్ కు 20వ మైల్ స్టోన్ మూవీ. ఇందులో లెజెండరీ వారియర్ క్యారెక్టర్ లో నిఖిల్ కనిపించనున్నారు. క్యారెక్టర్ కోసం వెపన్స్, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో రాజమౌళి పర్సనల్ సినిమాటోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న సినిమాటోగ్రాఫర్ KK సెంథిల్ కుమార్(K. K. Senthil Kumar) కు ఈ సినిమాలో పనిచేస్తున్నారట.
K. K. Senthil Kumar..
హీరో నిఖిల్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’ సినిమా కోసం దేశం గర్వించేలా చేసిన టెక్నిషియన్ వర్క్ చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి, RRR’ వంటి అనేక ఎపిక్ మూవీస్ కి పని చేసిన మాస్టర్ సినిమాటోగ్రాఫర్ KK సెంథిల్ కుమార్ ‘స్వయంభూ’లో తన మ్యాజిక్ చూపించనున్నారు. ఈ విషయం తెలుపుతూ మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు. మేకర్స్ విడుదల చేసిన ఈ వీడియోలో చూపిన విధంగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో ఈ టాప్ టెక్నిషియన్ ఇప్పటికే టీంలో చేరారు. మ్యాసీవ్ సెట్స్ తో గ్రాండ్‌గా ఈ చిత్రం రూపొందుతోందని మేకింగ్ వీడియో చూస్తే అర్థమౌతోంది. నిఖిల్ కెరిర్‌లో ఇప్పటి వరకు మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ సినిమా ఇదే కావడం విశేషం. కెకె సెంథిల్ డీవోపీగా చేయడంతో సినిమాలోని విజువల్స్ టాప్ నాచ్ గా ఉండబోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన మ్యాసీవ్ సెట్‌లో జరుగుతోంది.
నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి నిఖిల్ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ నిఖిల్‌ను సవ్యసాచిలా రెండు కత్తులతో, యుద్ధంలో శ్రతువులతో పోరాడుతున్న లెజండరీ వారియర్‌గా ప్రజెంట్ చేస్తోంది. మెరూన్ కలర్ కాస్ట్యూమ్ ధరించి, పొడవాటి జుట్టు, మెలితిప్పిన మీసాలు, గడ్డం, మజల్డ్ ఫిజిక్, బైసప్స్‌తో బీస్ట్ మోడ్‌లో కనిపించారు నిఖిల్. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Mahesh Babu : సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి కీలక అప్డేట్ ఇచ్చిన రాజమౌళి మూవీ టీమ్