Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా కల్కి 2898 AD విజయాన్ని సొంతం చేసుకున్న ప్రభాస్ (Prabhas), త్వరలో రాజాసాబ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. అదే విధంగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ చిత్రంపై కూడా విశేషమైన అంచనాలు నెలకొన్నాయి.
Prabhas Movie Rejects
అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం సాహో. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, మిశ్రమ ఫలితాలు సాధించినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు బాగానే నమోదు చేసింది. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ఇందులో కథానాయికగా నటించింది. కానీ మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనది మరెవరో కాదు, బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్.
సినిమా నిర్మాణ దశలో సాహో కోసం కత్రినాను సంప్రదించినప్పటికీ, ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించింది. మేకర్స్ దాదాపు ఆరు నెలల పాటు ఆమె సమాధానం కోసం వేచి చూసిన తర్వాత, చివరికి శ్రద్ధా కపూర్‌ను ఎంపిక చేశారు.
సుజీత్ దర్శకత్వం వహించిన సాహో చిత్రాన్ని సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.435 కోట్ల వసూళ్లు సాధించగా, దేశీయంగా మాత్రమే రూ.150 కోట్ల నికర కలెక్షన్లు నమోదు చేసింది. చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు, పాటలు ప్రత్యేకంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Also Read : Popular Singer Shreya Ghoshal : స్పాటిఫై టాప్ గాయనిగా శ్రేయా ఘోషల్



















