Gottipati Ravi : అమరావతి : ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravi) సంచలన ప్రకటన చేశారు. తమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ట్రాన్స్ కో అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ట్రాన్స్ కో ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణ వ్యయం తగ్గించాలని ఆదేశించామన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లతో సమావేశం కావాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపం లేకుండా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. రూ. 6 వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులు 2027 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Minister Gottipati Ravi Kumar Key Comments
క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రికి వివరించారు. సీఆర్డీఏలో అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ పై ఆరా తీశారు మంత్రి. సీఆర్డీఏ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. సీఆర్డీఏ పరిధిలో జరిగే నిర్మాణాలకు అత్యాధునిక టెక్నాలజీని అవలంబించాలని ఆదేశించారు. ఆక్వా రైతులకు చేయూతనిచ్చేలా సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టాలన్నారు గొట్టిపాటి రవికుమార్. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రిప్పింగ్ సమస్యకు పరిష్కారం చూపాలని అన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్లు, ఇతర పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
విజయవాడ, వైజాగ్ నగరాల్లో ఏర్పాటు కానున్న మెట్రోకు కావాల్సిన విద్యుత్ సౌకర్యంపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసి, నాణ్యమైన విద్యుత్ ను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 20, 30 ఏళ్ల నాటి పాత సబ్ స్టేషన్లలో మెయింటినెన్స్ పై దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీపై సీఎం చంద్రబాబు ఓకే చెప్పారని , త్వరలోనే భర్తీ చేస్తామన్నారు.
Also Read : MLC Kavitha Shocking Comments : సీఎం రేవంత్ కు హరీశ్ రావు సరెండర్
















