Pooja Hegde : ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే చర్చనీయాంశంగా మారింది. తనకు ఈ మధ్య అనారోగ్యం నెలకొందని, అంతా ఓకే అయ్యిందని, ప్రస్తుతం తాను రెస్ట్ తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయంపై స్పందించింది. వాతావరణం అనుకూలంగా మారిందని, కావాల్సిందల్లా తనకు కాసింత విరామమేనని పేర్కొంది. ఈ సందర్బంగా పూజా హెగ్డే (Pooja Hegde) ఇన్‌స్టాగ్రామ్‌లో తన పెంపుడు ఫ్రెంచ్ బుల్‌డాగ్‌తో తన బాల్కనీలో దుప్పటిలో చుట్టుకుని హాయిగా గడుపుతున్న చిత్రాన్ని పంచుకుంది. అదనపు సౌకర్యం కోసం నటి తన స్నేహితుడిని కౌగిలించుకుంటూ ఉన్న ఫోటో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా అనారోగ్య రోజులకు, కొంత విశ్రాంతి, కోలుకోవడం మాత్రమే అవసరం అని తాను భావిస్తున్నట్లు తెలిపింది.
Pooja Hegde Health Updates
తను దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇందుకు కారణం ఏమిటంటే తను కీ రోల్ పోషించింది ఇటీవల రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసిన రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, తదితరులు నటించిన కూలీ లో . ఇందులో తను స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇది సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఐ లవ్ యూ మోనికా అన్న పాట దుమ్ము రేపింది. రికార్డుల మోత మోగిస్తోంది. ఈ చిత్రంలో నటించిన వారంతా 50 ఏళ్లకు పైగా ఉన్న వారే. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. మౌనికా పాటలో కేరళ స్టార్ హీరో సౌబిన్ షాహిర్ నటించాడు. ఇది ఇప్పటికీ రికార్డుల మోత మోగిస్తోంది.
Also Read : Beauty Rukmini Vasanth : రుక్మిణి వసంత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్


















