Harish Rao : హైదరాబాద్ – కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ తుది నివేదికను సమర్పించింది. నిన్న, ఇవాళ పెద్ద ఎత్తున శాసన సభలో చర్చించారు. చివరకు 9 గంటల పాటు సాగింది దీనిపై. తుది నిర్ణయం ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇందుకు కేంద్ర దర్యాప్తు సంస్థనే ముఖ్యమని తాము భావిస్తున్నట్లు తెలిపారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు (Harish Rao), కేటీఆర్. దీనిని నిరసిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్బంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పిసి ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టకూడదని కోరుతూ బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో చర్చ లేకుండానే ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.
MLA Harish Rao Petition in High Court
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు ప్రజెంటేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇష్టపడటం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. బిఆర్ఎస్ ఈ ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజలకు తెలియ జేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశ పూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తన పిటిషన్ ను తిరస్కరించింది. ఈ మేరకు సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం విచారణ చేపడతామని బీఆర్ఎస్ నేతకు స్పష్టం చేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ సర్కార్ కేవలం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు కేటీఆర్. తమకు న్యాయ స్థానంపై నమ్మకం ఉందని, దాని ద్వారా తేల్చుకుంటామని స్పష్టం చేశారు.
Also Read : Massive Earthquake Shocking : భారీ భూకంపం ఆఫ్గనిస్తాన్ అతలాకుతలం

















