Deputy CM Pawan : అమరావతి : ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గానికి రూ. 400 కోట్ల నిధులు మంజూరు చేశామని చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొణిదల (Deputy CM Pawan). ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో కూటమి స్ఫూర్తి ప్రతిఫలించాలని స్పష్టం చేశారు. పాలన చేపట్టిన తొలి ఏడాదిలోనే భారీ ఎత్తున నిధులతో కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందన్నారు. అభివృద్ది పట్ల ఉన్న ప్రణాళికా బద్ధమైన ఆలోచన, నిబద్ధతే కారణమన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతం సమస్యలు, అభివృద్ధి పనులను తెలుసుకొనేలా రియల్ టైం వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు పవన్ కళ్యాణ్. కూటమి ఐక్యతే బలం, అప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ఈ వాస్తవాన్ని ఎవరూ విస్మరించవద్దని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గం జన సైనికులు, వీర మహిళలు, నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు పవన్ కళ్యాన్ కొణిదల.
Deputy CM Pawan Kalyan key Comments
నియోజకవర్గంలోని 52 గ్రామాలు, పిఠాపురం (Pithapuram) మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీ నుంచి ఈ సమావేశానికి వచ్చారు. వారి నుంచి సమస్యలు, పార్టీ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది కాలంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, పనుల పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ నియోజకవర్గంలో చేపట్టి ప్రతి అభివృద్ధి పని గురించి చెప్పేటప్పుడు, సంక్షేమ కార్యక్రమాల్లో పీఎం మోదీ, సీఎం చంద్రాబు గురించి కూడా చెప్పాలన్నారు.
కూటమిగా ఐక్యత చూపాలి. కోపతాపాలకు, వ్యాఖ్యలకు ఏ మాత్రం తావు లేదన్నారు. అదే సమయంలో జనసేన కోసం తొలి నుంచి నిస్వార్థంగా నిలిచిన ప్రతి కార్యకర్తకీ తగిన గుర్తింపు ఇస్తామన్నారు. ఇందుకోసం ప్రతి గ్రామం నుంచి అయిదుగురు పార్టీ సభ్యులతో కేంద్ర కార్యాలయం అనుసంధానం అవుతుందన్నారు. వారి ద్వారా తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కోరుకొంటున్నారు, ఉన్న సమస్యలు ఏమిటి, పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా సాగుతున్నాయో తెలుసుకుంటానని చె్పారు పవన్ కళ్యాణ్. ఆ అయిదుగురు ఎవరు అనేది ఆ గ్రామంలోని జనసేన క్రియాశీలక సభ్యులు, నాయకులే నిర్ణయించుకొని కేంద్ర కార్యాలయానికి తెలియ చేయాలన్నారు.
Also Read : Minister Anam Interesting Update : సీఎం చంద్రబాబు నాయుడు అరుదైన రికార్డ్

















