OG : దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించిన చిత్రం ఓజీ (OG). తెలుగు సినీ ఇండస్ట్రీలో దుమ్ము రేపుతోంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రముఖ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనిని ప్రముఖ దిగ్గజ నిర్మాత డీవీవీ దానయ్య ఓజీని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా ఇటీవలే మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన పాట విడుదలైంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రికార్డుల మోత మోగిస్తోంది. తాజాగా వచ్చిన మరో మెలోడీ సాంగ్ హృదయాలను హత్తుకునేలా ఉంది. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ను కొత్తగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
Pawan Kalyan OG Movie Updates
ఇక తనతో పోటీ పడి నటించింది నటి. పిక్చరైజేషన్, డ్యాన్స్ మూవ్ మెంట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మరో వైపు నిర్మాత డీవీవీ దానయ్య ఎస్ఎస్ రాజమౌళితో పని చేసేందుకు వేచి ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ ను తీసిన ఆయనకు భారీ లాభాలను తీసుకు వచ్చేలా చేసింది. ప్రస్తుతం జక్కన్న ప్రిన్స్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో కలిసి ఎస్ఎస్ఎంబీ 29 మూవీ తీస్తున్నాడు. ప్రస్తుతం దానయ్య భారీగా ఖర్చు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ కోసం. పూర్తిగా రిచ్ నెస్ కనిపిస్తోంది సినిమాలో. ఈ చిత్రం ప్రకటించిన రోజు నుండి చిత్ర వర్గాలలో హాట్ హాట్‌గా ఉంది. సుజీత్ పవన్ కళ్యాణ్‌ను అత్యంత స్టైలిష్‌గా ప్రజెంట్ చేశాడు .
ఇదిలా ఉండగా ఓజీని నాన్-థియేట్రికల్ హక్కులను రికార్డు ధరలకు అమ్మేశాడు. ఈ డీల్స్ పవన్ కళ్యాణ్ చిత్రాలలో అత్యధిక వసూళ్లు సాధించిన వాటి కంటే ఎక్కువగా ఉండడం విశేషం. ఆర్ఆర్ఆర్ తర్వాత ఓజీ నిర్మాతకు జాక్‌పాట్ లాంటిది. నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కైవసం చేసుకుంది . ఇక అమెరికాలో ప్రీ రిలీజ్ టికెట్లు జాక్ పాట్ కొట్టేలా చేస్తోంది.
Also Read : Hero Prabhas Spirit : ప్రభాస్ స్పిరిట్ కోసం టాప్ హెయిర్ స్టైలిస్ట్


















