KTR : హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శనివారం ప్రారంభమైన శాసన సభలో. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు సంతాపం తెలిపారు. సభలో తనకు సంతాపం తెలపాల్సి వస్తుందని తాను ఏనాడు అనుకోలేదన్నారు. ఇది తన జీవితంలో అత్యంత విషాదకరమైదిగా పేర్కొన్నారు. ఆయన అనారోగ్యం గురించి ఏనాడు ఎవరికీ చెప్పుకోలేదు కానీ, జూబ్లీహిల్స్ ప్రజల కోసం చివరిదాకా పాటుపడ్డారని గుర్తు చేసుకున్నారు.
KTR Praises Maganti Gopinath
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేవలం ధనవంతులు మాత్రమే ఉంటారని అనుకుంటారు. కానీ, అది అనేక బస్తీలు కలిగిన పేదల నిలయమన్నారు కేటీఆర్ (KTR). హైదరాబాద్‌లో పుట్టి, ఉస్మానియాలో డిగ్రీ పూర్తి చేసి, ఎన్టీఆర్ నాయకత్వంలో వీరాభిమానిగా పని చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారన్నారు . ఎన్టీఆర్ నిలువెత్తు కటౌట్ (రాముడు, కృష్ణుడి రూపంలో) పెట్టింది మొట్ట మొదటిసారిగా గోపీనాథ్ అని చెప్పారు కేటీఆర్. .తెలంగాణ నుంచి టీడీపీ మాయం అయిన తర్వాత కేసీఆర్ తో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చారని చెప్పారు.
ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగినా, ఆయన సొంత ఇంటి పరిస్థితి చూస్తే చూస్తే ఆశ్చర్యం కలిగిందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలంతా గోపీనాథ్ ని ‘గోపన్న’ అంటూ ప్రేమగా పిలుచుకుంటారని అన్నారు కేటీఆర్.తెలంగాణలోని ఆడబిడ్డలకు బతుకమ్మ చీర ఇచ్చే సంప్రదాయాన్ని ఆయన తన నియోజకవర్గంలో ప్రారంభించారని పేర్కొన్నారు . నియోజకవర్గంలోని పేద ప్రజలందరి కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. గోపన్న బతికినంత కాలం ఒక మాస్ లీడర్‌గా పేదల కోసం పనిచేశారని చెప్పాడు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా తమ పార్టీపై నమ్మకంతో, విధేయుడిగా ఉండి, రెండుసార్లు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మారకుండా విలువలకు కట్టుబడ్డారని పేర్కొన్నారు.
Also Read : BRS MLA’s Fired on Congress Govt : యూరియా కొరతపై భగ్గుమన్న ఎమ్మెల్యేలు















