Supreme Court : న్యూఢిల్లీ – సు్ప్రీంకోర్టులో కొత్తగా న్యాయమూర్తులు కొలువు తీరారు. సీజేఐ జస్టిస్ గవాయి వారితో ప్రధాన న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. శుక్రవారం సుప్రీంకోర్టు (Supreme Court) హాలు ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. దీంతో సుప్రీంకోర్టు సీజేఐతో సహా 34 మంది న్యాయమూర్తులతో పూర్తి స్థాయి బలాన్ని తిరిగి పొందనుంది. జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోలితో సీజేఐ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు సీజేఐ బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే , పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విపుల్ మనుభాయ్ పంచోలిలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆగస్టు 27న వీరిద్దరూ సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.
Supreme Court of India New Judges
జస్టిస్ పంచోలి అక్టోబర్ 2, 2031న పదవీ విరమణ చేసిన తర్వాత, జస్టిస్ పంచోలి అక్టోబర్ 2031లో భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది. ఆయన అక్టోబర్ 3, 2031న సీజేఐ పదవిని చేపట్టి, మే 27, 2033న పదవీ విరమణ చేయనున్నారు. ఆగస్టు 25న, సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి న్యాయమూర్తులు ఆరాధే, పంచోలి పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతికి సిఫార్సు చేసింది. అయితే, కొలీజియం సభ్యురాలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి.వి. నాగరత్న, జస్టిస్ పంచోలిని సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించాలన్న సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సుపై తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేశారు. ఆయన నియామకం న్యాయ వ్యవస్థకు “ప్రతికూలమైనది” అని అన్నారు.
Also Read : BSNL Pay – New Innovation : ఇతర యూపీఐ షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా బీఎస్ఎన్ఎల్
















