PM Modi : జపాన్ – రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ శుక్రవారం జపాన్ దేశానికి చేరుకున్నారు. ఇందులో భాగంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆగస్టు 29 నుండి 30 వరకు జపాన్ పర్యటన సందర్భంగా మోడీ (PM Modi) జపాన్ ప్రధాని ఇషిబాతో శిఖరాగ్ర చర్చలు జరుపుతారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కేంద్ర కార్యాలయం వెల్లడించింది. టోక్యోకు చేరుకున్న వెంటనే మోదీకి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. భారీ ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
PM Modi Arrives Japan
భారతదేశం-జపాన్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రధాని షిగేరు ఇషిబాతో విస్తృత చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్య నాగరిక బంధాలు , సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక అవకాశంగా ఉంటుందని అన్నారు మోదీ. గత 11 సంవత్సరాలుగా స్థిరమైన, గణనీయమైన పురోగతిని సాధించిన మా ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యంలో తదుపరి దశను రూపొందించడంపై తాము దృష్టి పెడతామని స్పష్టం చేశారు ఈ సందర్భంగా నరేంద్ర మోదీ.
మా సహకారానికి కొత్త రెక్కలు ఇవ్వడానికి, మా ఆర్థిక, పెట్టుబడి సంబంధాల పరిధిని, ఆశయాన్ని విస్తరించడానికి, కీలక ప్రాధాన్యత రంగాలపై ఫోకస్ పెడతామన్నారు. ఏఐ, సెమీకండక్టర్లతో సహా కొత్తగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తాము ప్రయత్నం చేస్తామన్నారు ప్రధానమంత్రి. అంతే కాకుండా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై కూడా ఇరు దేశాల ప్రధానులు ప్రత్యేకంగా చర్చించనున్నట్లు సమాచారం.
Also Read : RC Bhargava Shocking Comments : ట్రంప్ బెదిరింపులకు భారత్ తలవంచొద్దు

















