CM Chandrababu : అమరావతి : రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులు ఫాస్ట్ ట్రాక్ లో పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) స్పష్టం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో త్వరగా అనుమతులు ఇస్తున్నామని, అదే తరహాలో ప్రాజెక్టుల గ్రౌండింగ్ కూడా అంతే వేగంగా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. సీఎం అధ్యక్షతన 10వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశమైంది. రూ. 53922 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే 30 ప్రాజెక్టులకు సీఎం ఆధ్వర్యంలోని ఎస్ఐపీబీ ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 83,437 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఇక నుంచి ప్రతీ నెలా సమీక్షస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
CM Chandrababu Key Comments
ఈ ప్రాజెక్టుల్లో స్థితిగతులపై క్షేత్రస్థాయిలో మంత్రులు కూడా పరిశీలించాలని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ అనుమతులిచ్చిన ప్రాజెక్టుల వివరాలను, ఉత్పత్తి ప్రారంభించేందుకు ఎంత సమయం పట్టిందన్న అంశాలను విశ్లేషించాలని సీఎం సూచించారు. ఏ ప్రాజెక్టు అయినా ఆలస్యం అవుతుంటే సంబంధిత సంస్థల ప్రతినిధులతో మాట్లాడి పనులు వేగంగా పూర్తి చేసేలా చూడాలన్నారు. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నామని.. అధికారులు కూడా అదే వేగంతో పనిచేయాలని సూచించారు. మహింద్రా ఈవీ వాహనాల ఉత్పత్తి ప్లాంట్ ను ఏపీలో ఏర్పాటు చేసేలా తానే స్వయంగా సంప్రదిస్తున్నానని.. దీనికి అనుగుణంగా అధికారులూ స్పందించాలని సీఎం అన్నారు.
Also Read : AP CS Interesting Comments : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫించన్ అందాలి : సీఎస్















