AP CS : అమరావతి : రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఫించన్ అందించాలని స్పష్టం చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ (AP CS). ఎక్కడైనా అర్హత ఉండి ఫించన్ రాలేదని ఫిర్యాదు వస్తే అందుకు సంబంధిత జిల్లా కలక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, భుగర్భ జలాలు, పియం కుసుమ్ పధకానికి భూ సంబంధిత అంశాలు, పింఛన్లు, జిల్లా జువెనైల్ జస్టీస్ కమిటీల ఏర్పాటు వాటి అమలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధిత అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ముందుగా పింఛన్లు పంపిణీపై సిఎస్ మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పెన్షన్ అందేలా చూడాలని అన్నారు.
AP CS Key Comments
ప్రతినెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా,మండల ప్రత్యేక అధికారులు తప్పక పాల్గొనాలని ఆదేశించారు.పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని అర్హత గలవారందరికీ తప్పనిసరిగా ఫించన్ అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అర్హత ఉన్నా ఫించన్ రాలేదని మీడియా, సోషల్ మీడియా లేదా మరే ఇతర మార్గాల్లోనైనా ఫిర్యాదులు వస్తే అందుకు ఆయా జిల్లా కలక్టర్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని సిఎస్ విజయానంద్ పునరుద్ఘాటించారు. పెన్షన్ల తనిఖీకి సంబంధించి లక్షా 35 వేల మందికి నోటీసులు జారీ చేసి నెలరోజుల్లోగా ఎంపిడిఓలకు అప్పీళ్ చేసుకోవాలని తెలియ చేశామన్నారు.
Also Read : Pawan Kalyan Interesting Comments : జనం కోసం పుట్టిందే జనసేన – పవన్ కళ్యాణ్

















