CR Media : అమరావతి – ఏపీ రాజధాని అమరావతిపై అబద్దాలను ప్రచారం చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సీఆర్ మీడియా (CR Media) అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ (Alapati Suresh Kumar). అకాడమీ ఆధ్వర్యంలో గురువారం అమరావతిపై అబద్దపు ప్రచారం భావ స్వేచ్ఛ ప్రకటన అనే అంశంపై సెమినార్ చేపట్టారు. ఇందులో సి ఆర్ మీడియా అకాడెమీ చైర్మన్ ఆలపాటి సురేష్, జస్టిస్ సునీల్ చౌదరి, ప్రముఖ చరిత్రకారుడు సాయి, అమరావతి రైతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర విభజన తో ఆంధ్ర ప్రజలు రాజీ పడ్డారని చెప్పారు. అయితే మనకి ఓ రాజధాని కావాలి కదా అని ప్రశ్నించారు.
CR Media Key Comments
ఆనాటి ప్రభుత్వం రాజధాని ‘అమరావతి’ అని ప్రారంభించిందని అన్నారు. అప్పుడు ఎవరూ అడ్డు చెప్ప లేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. 2019 తర్వాత అమరావతికి అరిష్టం మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అరిష్టం ఏమిటంటే జగన్ మోహన్ రెడ్డి రూపంలో ఏర్పడిన వైసీపీ సర్కార్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మిస్తున్నారు అంటే అందరూ ముందుకొచ్చి ప్రోత్సహిస్తారు.. కానీ ఏపీలో ఆ పరిస్థితి లేకుండా పోయిందని వాపోయారు. మన రాజధానిని మనం ప్రేమించుకోలేమా, అమరావతిపై ఎందుకు బురదజల్లడం అంటూ ప్రశ్నించారు ఆలపాటి సురేష్ కుమార్.
2019 తర్వాత కొద్ది నెలలకే అమరావతిని నాశనం చేద్దామని ప్రయత్నం చేశారని ఆరోపించారు. అందుకే రివర్స్ టెండరింగ్, అమరావతి ముంపు ప్రాంతం, అమరావతి రాజధానికి పనికి రాదు అన్నారని మండిపడ్డారు. అమరావతి విషయంలో కోర్ట్ లు కూడా అక్కడ రాజధాని నిర్మించ వచ్చని తీర్పులు చెప్పిన విషయం మరిచి పోతే ఎలా అని నిలదీశారు ఆలపాటి సురేష్ కుమార్. ఇప్పుడు మళ్లీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొంత సానుకూల ధోరణి కనిపిస్తోందన్నారు. అయినా దుష్ప్రచారం చేయడం మానుకోవడం లేదన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అమరావతి మునిగి పోయిందంటూ అబద్దాలు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Peter Navarro Fired on PM Modi : మోడీపై నోరు పారేసుకున్న ట్రంప్ అడ్వైజర్















