HDFC Bank : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ప్రీమియం ఇంపీరియా ప్రోగ్రామ్ కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ మార్పులు అక్టోబర్ 1, 2025 నుంచి అమలులోకి రానున్నాయి. జూన్ 30 లేదా అంతకుముందు ఈ ప్రోగ్రామ్‌లో చేరిన కస్టమర్లకు కూడా కొత్త నియమాలు వర్తిస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది.
HDFC Bank – కొత్త నిబంధనలు
- ఇంపీరియా కస్టమర్‌గా మారాలంటే లేదా కొనసాగాలంటే, కనీసం రూ.1 కోటి టోటల్ రిలేషన్ షిప్ విలువ (TRV) ఉండాలి.
- జూలై 1, 2025 నుంచి కొత్తగా చేరినవారు, స్టేటస్ అప్‌గ్రేడ్ లేదా డౌన్‌గ్రేడ్ అయినవారికి ఈ నిబంధనలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి.
- అక్టోబర్ 1 నుంచి పాత కస్టమర్లందరికీ ఇవే షరతులు వర్తిస్తాయి.
TRV అంటే ఏమిటి?
TRV అనేది కస్టమర్‌కు బ్యాంకుతో ఉన్న మొత్తం ఆర్థిక సంబంధాన్ని సూచిస్తుంది. ఇందులో సేవింగ్స్ ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రుణాలు మరియు పెట్టుబడులు కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
TRV చేరుకోకపోయినా కొనసాగవచ్చా?
ఒకవేళ రూ.1 కోటి TRV ప్రమాణం చేరుకోలేకపోయినా, కస్టమర్లు కింది షరతులలో ఏదైనా ఒకటి నెరవేర్చితే ఇంపీరియాలో కొనసాగవచ్చు:
- కరెంట్ అకౌంట్‌లో త్రైమాసిక సగటు బ్యాలెన్స్ రూ.15 లక్షలు.
- సేవింగ్స్ అకౌంట్‌లో నెలవారీ సగటు బ్యాలెన్స్ రూ.10 లక్షలు.
- సేవింగ్స్, కరెంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు కలిపి నెలవారీ సగటు బ్యాలెన్స్ రూ.30 లక్షలు.
- హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank) కార్పొరేట్ శాలరీ అకౌంట్ కలిగి, నెలకు కనీసం రూ.3 లక్షలు జీతం రావడం.
ఇంపీరియా కస్టమర్లకు లభించే సేవలు
ఇంపీరియా ప్రోగ్రామ్‌లో భాగమైన కస్టమర్లకు బ్యాంక్ ఎటువంటి ఛార్జీలు లేకుండా పలు ప్రీమియం సేవలు అందిస్తోంది. వాటిలో:
- బ్రాంచ్‌ల నుండి ఉచిత డబ్బు బదిలీ
- చెక్ స్టాప్ పేమెంట్ సూచనలు
- డూప్లికేట్ స్టేట్‌మెంట్ లేదా పాత రికార్డులు పొందడం
- వడ్డీ లేదా బ్యాలెన్స్ సర్టిఫికేట్లు జారీ
- సంతకం, చిరునామా ధృవీకరణ వంటి సేవలు
Also Read : Trump New Tarrifs Shocking : భారత్ పై మొదలైన ట్రంప్ కొత్త సుంకాలు



















