Minister Atchannaidu : అమరావతి – రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) హామీ ఇచ్చారు. 2025 ఖరీఫ్ కోసం 31.15 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల అంచనా వేశామన్నారు. ఇప్పటి వరకు 21.34 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని వెల్లడించారు. ఎరువుల కొరత రాకుండా 1.10 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. గోదావరి వరదలతో సమస్యలు తలెత్తినా, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందన్నారు. ఆగస్టు నెలలో 1.65 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా, అందులో 0.75 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి చేరాయన్నారు. మిగిలిన 0.90 లక్షల మెట్రిక్ టన్నులు గంగవరం, కాకినాడ, విశాఖపట్నం, ఒరిస్సా పోర్టుల ద్వారా త్వరలో చేరనున్నాయని చెప్పారు కింజారపు అచ్చెన్నాయుడు.
Minister Atchannaidu Key Comments
ప్రస్తుతం రాష్ట్రంలో 6.48 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని కోరారు. ఇప్పటి వరకు 21.34 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి చేరాయని తెలిపారు. అందులో యూరియా, డీఏపీ , ఎంఓపీ, ఎస్‌ఎస్‌పీ, కాంప్లెక్స్ ఎరువులు కలిపి 6.22 లక్షల మెట్రిక్ టన్నులు రైతులకు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రం మొత్తం రైతుల అవసరాలను బట్టి జిల్లాల వారీగా సరఫరాలను సక్రమంగా పర్యవేక్షిస్తున్నామని వివరించారు.
రైతులకు ఎరువుల కొరత రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని 1.10 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఉంచిందని మంత్రి తెలిపారు. ఇంకా 79,633 మెట్రిక్ టన్నులు డిపోలలో నిల్వగా ఉండగా, అవసరమైన ప్రాంతాలకు తరలింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Also Read : Amaravati Property Festival Interesting : విజయవాడలో 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్
















