AP Govt : అమరావతి : ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం (AP Govt) నిర్ణయించింది. వినాయక చవితి ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పందిళ్ళకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు నిర్వాహకులు మంత్రి నారా లోకేష్ ను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించారు లోకేష్.. వెంటనే ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో మాట్లాడారు.
AP Govt Key Updates
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 వేల గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. గణేష్ ఉత్సవ పందిళ్ళకు ఉచిత విద్యుత్ అందించడానికి రూ.25 కోట్లు ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని ఈ సందర్బంగా సీఎంకు వెల్లడించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్రంలోని కోట్లాది గణేష్ భక్తుల సౌలభ్యం దృష్ట్యా ఉచిత విద్యుత్ అందించేలా చూడాలని మంత్రి లోకేష్ చేసిన వినతిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
ఈ మేరకు ప్రత్యేకంగా జీ.ఓ విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే రాబోయే విజయదశమి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసి దుర్గా దేవి మండపాలక కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా వినాయక చవితి సందర్బంగా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇవ్వడం పట్ల గణేశ్ మండపాల నిర్వాహకులు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు, చొరవ చూపిన మంత్రి నారా లోకేష్ కు, సానుకూలంగా ఓకే చెప్పిన గొట్టి పాటి రవి కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : Indians Lose Huge Money : గేముల పేరుతో ఏడాదిలో 20 వేల కోట్లు నష్టపోయిన భారతీయులు
















