Airtel : భారతీయ టెలికం రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఎయిర్‌టెల్ (Airtel) తాజాగా తీసుకున్న కీలక నిర్ణయం వినియోగదారుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. దేశవ్యాప్తంగా ఎంతో మందికి చవకగా, తక్కువ గడువుతో వినియోగించదగిన ప్రీపెయిడ్ ప్లాన్‌గా పేరుగాంచిన రూ.249 రీఛార్జ్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ (Airtel) అధికారికంగా నిలిపివేసింది.
Airtel Shocking
ఈ ప్లాన్‌లో రోజుకు 1GB డేటా, అపరిమిత కాల్స్, 100 SMSలు కలిపి 24 రోజుల వ్యాలిడిటీ లభించేది. ముఖ్యంగా చిన్న ఉద్యోగులు, గృహిణులు, విద్యార్థులు ఈ ప్లాన్‌ను విస్తృతంగా ఉపయోగించేవారు. తక్కువ ఖర్చుతో సరైన డేటా సేవలు అందించడంతో ఇది ఎంతో ప్రజాదరణ పొందింది.
అయితే, కంపెనీ ఈ ప్లాన్‌ను ఆగస్టు 20, 2025 నుండి నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌లో గానీ, ఇతర రీచార్జ్ ప్లాట్‌ఫామ్‌లలో గానీ కనిపించడం లేదు. అంటే ఇకపై వినియోగదారులు ఈ ప్లాన్‌ను రీచార్జ్ చేసుకునే అవకాశం ఉండదు.
ఈ నిర్ణయం నేపథ్యంలో వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరలో సౌకర్యవంతమైన డేటా ప్లాన్‌ను రద్దు చేయడం సరైంది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జియో సంస్థ తక్కువ ధర ప్లాన్‌లను తొలగించిన నేపథ్యంలో, ఎయిర్‌టెల్ కూడా అదే బాటలో నడవడం వినియోగదారులపై ఆర్థిక భారం మోపుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇకపై ఎయిర్‌టెల్ ప్రారంభ ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.299 కాగా, ఇందులో 1.5GB డేటా/రోజు, అపరిమిత వాయిస్ కాల్స్, 100 SMSలు, 28 రోజుల వ్యాలిడిటీ లభించనుంది. ఇది రూ.249 ప్లాన్ కంటే ఖరీదైనదిగా భావించబడుతోంది.
మొత్తానికి, రోజురోజుకు టెలికం సంస్థలు తమ ప్రారంభ ధరల్ని పెంచుతూ బడ్జెట్ వినియోగదారులకు చికాకు కలిగిస్తున్నాయి. మినిమం ప్లాన్ వృద్ధితో చిన్న స్థాయి వినియోగదారులకు టెలికం సేవలు మరింత భారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read : Dream11 New Innovation : ఆన్‌లైన్ గేమింగ్ నుండి ఆర్థిక లావాదేవీలు వైపు మళ్ళిన డ్రీమ్11



















