Sahasra : హైదరాబాద్ – తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన బాలిక సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ ఘటనకు పాల్పడింది ఎవరో కాదు బాలుడు. రోజు రోజుకు పెరుగుతున్న నేర ప్రవృత్తి, సంస్కృతి మరింత ఆందోళన కలిగించేలా చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి శనివారం మీడియాకు వెల్లడించారు. కేవలం క్రికెట్ బ్యాట్ కోసమే సహస్రను (Sahasra) బాలుడు చంపేశాడని వెల్లడించారు . ఆ బ్యాట్ ను చోరీ చేసేందుకు వెళ్లి హత్య చేశాడన్నారు. బ్యాట్ దొంగతనం చేసింది చూసి పాప అరిచిందని, దీంతో భయంతో వెంట తెచ్చుకున్న కత్తితో బాలికను పొడిచాడని తెలిపారు. నిందితుడు పోలీసులను తప్పు దారి పట్టించాడని , హత్యకు వాడిన కత్తి, ఇతర ఆధారాలను సేకరించామన్నారు.
Sahasra Murder Mystery
ఈ నేరాన్ని తానే చేసినట్లు 10వ తరగతి చదువుతున్న బాలుడు ఒప్పుకున్నాడని చెప్పాడు సీపీ మహంతి.
మృతురాలి తమ్ముడి బ్యాట్ బాగుందని, దానిని ఎలాగైనా దొంగిలించాలని ప్లాన్ చేశాడన్నారు. ఆగస్టు 18న మనోడు పేరెంట్స్ లేనిది చూసి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో సహస్ర టీవీ చూస్తోందని తెలిపారు. కిచెన్ లో ఉన్న బ్యాట్ ను గుర్తించాడు. మెల్లగా చప్పుడు చేయకుండా తీసుకునేందుకు వెళ్లాడు. బ్యాట్ తీసుకుంటున్నట్లు శబ్దం వచ్చింది. సహస్ర దీనిని గమించి కేకలు వేసింది. తనను నిలదీసింది. ఈ సమయంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి చంపాడని చెప్పారు సీపీ అవినాష్ మహంతి. తనకు ఏమీ తెలియనట్లు నటించాడు. పేరెంట్స్ కంట పడకుండా బాత్రూంకు వెళ్లి రక్తపు మరకలు ఉన్న బట్టలను వాషింగ్ మెషీన్ లో వేశాడని చెప్పారు. అనుమానం వచ్చి తల్లిని అడిగితే తెలియదని సమాధానం చెప్పాడు. నిందితుడు సరిగా స్కూల్ కు వెళ్లేవాడు కాదని, నిత్యం ఓటీటీ, క్రైమ్ సినిమాలు చూసే వాడన్నారు.
Also Read : Popular OpenAI – KTR : ఓపెన్ ఏఐ ఆఫీసు హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలి
















