Deputy CM Pawan : అమరావతి – పిఠాపురం లోని ప్రముఖ శక్తి పీఠం శ్రీ పురుహూతిక అమ్మ వారి ఆలయ ప్రాంగణం శ్రావణ మాసం చివరి శుక్రవారం వరలక్ష్మి దేవి వ్రత పూజలతో సందడిగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan) తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకర్గంలోని మహిళలకు చీర, పసుపు కుంకుమలు పంపించారు. 14 వేల మందికి శ్రావణ మాస కానుకలు ఆలయ ప్రాంగణంలో ఇచ్చారు. తొలుత 10 వేల మందికి శ్రావణ మాస కానుకలు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే భక్తురాళ్ళు ఎక్కువ మంది హాజరవుతారని సమాచారం ఉండటంతో మరో నాలుగు వేల మందికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఈ ఏడాది 14 వేల మందికి శ్రావణ మాస కానుకను అందించగలిగారు.
Deputy CM Pawan Kalyan Interesting Update
అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి అమ్మవార్ల పేర్లతో ఐదు భక్త బృందాలుగా ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆడపడుచులు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి పూజల్లో ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ పాల్గొని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. పవన్ కళ్యాణ్ పంపిన చీరలను కానుకగా ఆడపడుచులకు అందజేశారు. ప్రతి బృందంలో 1500 మందికిపైగా మహిళలు వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించారు. పూజలో పాల్గొన్న ఆడపడుచులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పూజా సామగ్రిని ఉచితంగా సమకూర్చారు.
వరలక్ష్మీ వ్రతం ఆచరణ కోసం వేకువజాము నుంచి వేలాది మంది మహిళలు శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీ పురూహూతిక అమ్మవారి దివ్య క్షేత్రానికి తరలివచ్చారు. వేద పండితులు, ఆలయ వంశపారపర్య అర్చకులు మహిళలతో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వత్రాన్ని చేయించారు. ముందుగా వరలక్ష్మి దేవిని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కొలువు దీర్చారు. అనంతరం గణపతి పూజ, కలశారాధన, అమ్మవారి అష్టోత్తర శతనామావళి, వరలక్ష్మీ స్తోత్రాలు, షోడషోపచార పూజలు ఆచరింపజేశారు. పండితులు వరలక్ష్మిదేవి వ్రతకథను చదివి వినిపించారు.
Also Read : Minister Lokesh Interesting Update : ప్రతి ఏటా డీఎస్సీ నియామకం – లోకేష్



















