Rajnath Singh : ఒడిశా – ఒడిశాలోని చాందీపూర్ నుంచి అగ్ని 5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. దీనిని స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. అన్ని కార్యాచరణ, సాంకేతిక పారామితులను ధృవీకరించిందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీనిని డీఆర్డీఓ తయారు చేయడం విశేషం. ఇదిలా ఉండగా తన వ్యూహాత్మక సైనిక సామర్థ్యాలను ప్రదర్శించడానికి దీనిని పరీక్షించింది. చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి ఈ క్షిపణిని వ్యూహాత్మక దళాల కమాండ్ ఆధ్వర్యంలో ప్రయోగించామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా గత ఏడాది మార్చిలో కూడా భారతదేశం అగ్ని-5 క్షిపణిని పరీక్షించింది. అగ్ని సిరీస్ క్షిపణులు 700 కి.మీ నుండి 3,500 కి.మీ వరకు దూరం కలిగి ఉంటాయి.
Defence Minister Rajnath Singh Key Comments
గత నెలలో భారతదేశం అణ్వస్త్ర సామర్థ్యం గల స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు పృథ్వీ-II తోపాటు అగ్ని-I లను విజయవంతంగా పరీక్షించింది. పృథ్వీ-II క్షిపణి దాదాపు 350 కి.మీ పరిధిని కలిగి ఉంది. అంతే కాకుండా 500 కి.జీల వరకు పేలోడ్‌ను మోయగలదు. ఇది సాంప్రదాయ, అణ్వస్త్ర వార్‌హెడ్‌లను మోయగలదు. అగ్ని-1 క్షిపణి 700-900 కి.మీ పరిధిని కలిగి ఉంది ఇది 1,000 కి.జీల పేలోడ్‌ను మోస్తుందని రక్షణ శాఖ వెల్లడించింది. పృథ్వీ-II, అగ్ని-I క్షిపణులు రెండూ భారతదేశ అణ్వస్త్ర నిరోధకంలో అంతర్భాగంగా ఉన్నాయి. జూలైలో భారతదేశం కొత్తగా అభివృద్ధి చేసిన వ్యూహాత్మక క్షిపణి ప్రలేను కూడా పరీక్షించింది, ఇది సాంప్రదాయ వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది 500 కిలోల నుండి 1,000 కిలోల పేలోడ్ సామర్థ్యం కలిగి ఉంది.
Also Read : CM Chandrababu – AP Growth : సంక్రాంతి నాటికి మరో 2 లక్షల ఇళ్లు సిద్దం















