AP Govt : అమరావతి – ఏపీలో మందు బాబులకు తీపి కబురు చెప్పింది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు నూతన మద్యం పాలసీని తీసుకు వచ్చింది. ఇందుకు సంబంధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయుడు (CM Chandrababu) ఆదేశాల మేరకు సీఎస్ విజయ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాల్టి నుంచి కొత్త బార్ పాలసీ అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి మంగళగిరిలోని ఎక్పైజ్ శాఖ కమిషనరేట్ వేదికగా కొత్త బార్ పాలసీపై ఏపీ ఆబ్కారీశాఖ కమిషనర్ నిశాంత్‌కుమార్ కీలక ప్రకటన చేశారు.
AP Govt Important Update
రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లు ఉండగా.. ఇకపై వాటిలో పది శాతం కల్లు గీత కార్మికులకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కొత్త వాళ్లు సైతం మద్యం వ్యాపారంలోకి వచ్చేలా కొన్ని మార్పులు చేశామని చెప్పారు. గతంలో బార్ లైసెన్స్ పొందాలంటే రెస్టారెంట్ లైసెన్స్ ముందే ఉండాలనే నిబంధన ఉండేదని ఇప్పుడు దానిని సడలించామని అన్నారు. 15 రోజుల్లో రెస్టారెంట్ ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు.
ఇక లైసెన్స్ ఫీజులు 70 నుంచి 50 శాతానికి తగ్గాయని వివరించారు. దానిలో భాగంగా.. 50 వేల లోపు జనాభా ఉంటే రూ. 35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభాకు రూ. 55 లక్షలు, 5 లక్షలపైన జనాభా ఉంటే రూ. 75 లక్షల లైసెన్స్ ఫీజు ఉంటుందని నిశాంత్ కుమార్ వెల్లడించారు. ప్రతి ఏడాది పది శాతం చొప్పున ఫీజులు పెంచుతామని స్పష్టం చేశారు. అలాగే.. గతంలో ఒకేసారి ఆగస్టులోపు లైసెన్స్ ఫీజు కట్టాల్సి ఉండేదని.. ఈసారి ఆరు సార్లు చెల్లించవచ్చని చెప్పారు. గతంలో బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచే వారని, దానిని కూడా సడలించినట్లు పేర్కొన్నారు.
Also Read : CM Revanth Reddy Interesting : జస్టిస్ సుదర్శన్ రెడ్డికి బేషరతుగా మద్దతు ఇవ్వండి : సీఎం

















