Kerala : కేరళ – అరుదైన ఘనతను సాధించింది కేరళ రాష్ట్రం. 100 ఏళ్లకు పైగా ఉన్న వృద్ధులు డిజిటల్ యుగాన్ని స్వీకరించారు. ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ కీలకంగా మారింది. డిజిటల్ అక్షరాస్యత అన్నది అవసరంగా మారడంతో ‘డిజి కేరళ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో కేరళను (Kerala) డిజిటల్ అంతరాన్ని తగ్గించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. పుల్లంపారలోని ప్రతి ఇంటిని డిజిటల్ అక్షరాస్యులుగా మార్చే చిన్న పైలట్‌గా ప్రారంభమైన ఈ కార్యక్రమం త్వరలో రాష్ట్ర వ్యాప్త మిషన్ ‘డిజి కేరళ’గా మార్చేలా చేసింది, దీనికి స్థానిక స్వపరిపాలన శాఖ నాయకత్వం వహిస్తుంది. కేరళ రాజధాని జిల్లా తిరువనంతపురంలోని పుల్లంపారకు చెందిన 73 ఏళ్ల సి సరసు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉద్యోగిగా పని చేస్తోంది. డిజిటల్ వరల్డ్ అనేది ఇక పరాయి ప్రదేశం కాదు.
Kerala Top in Digital Litaracy
తన సొంత యూట్యూబ్ ఛానెల్ ను నడిపిస్తోంది. సరసుస్ వరల్డ్‌ను నడపడం నుండి రీల్స్ చూడటం వరకు, ఆమె ఇప్పుడు డిజిటల్ హైవేను సులభంగా నావిగేట్ చేస్తోంది. 103 ఏళ్ల కరుణాకర పనికర్ తన 74 ఏళ్ల కుమారుడు రాజన్‌తో కూర్చున్నారు. ఒకప్పుడు టచ్ స్క్రీన్‌ను తాకడానికి సంకోచించే ఈ జంట ఇప్పుడు తమ మొబైల్ ఫోన్లలో వార్తలు చూస్తారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా అప్డేట్గా ఉంటారు. 105 ఏళ్ల వయసున్న ఎంఏ అబ్దుల్లా మౌలవి బఫాకి, పెరుంబవూర్‌లోని ఒడక్కలిలోని తన ఇంట్లో తన ఫోన్ నుండే డిజిటల్ అక్షరాస్యులుగా మారినందుకు తన ఆనందాన్ని పంచుకుంటూ డిజిటల్‌కు మారాడు. ఇటీవలి వరకు, అబ్దుల్లా ఫోన్ పరిజ్ఞానం తన చిన్న నోకియా హ్యాండ్‌సెట్‌లో కాల్స్ చేయడం కంటే ఎక్కువగా లేదు. ప్రభుత్వ డిజి కేరళ వాలంటీర్లు అతనిని సంప్రదించినప్పుడు అది మారి పోయింది. నెలల్లోనే అతని డిజిటల్ కల సాకారమైంది.
Also Read : DK Shivakumar Shocking Comments : అక్రమ నిర్మాణాల వల్లే అగ్ని ప్రమాదాలు
















