MP Appalanaidu : అమరావతి – స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనక పోవడం జగన్ అహంకారాన్ని తెలియ జేస్తోందని అన్నారు టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు (MP Appalanaidu). మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. సూపర్ సిక్స్ లోని హామీలు అద్భుతంగా అమలవుతున్నాయని చెప్పారు. ఆగస్టు 15వ తేది నుండి స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం పట్ల మహిళలు చాలా ఆనందంగా ఉన్నారని అన్నారు. ఎక్కడ చూసినా జనం జేజేలు పలుకుతున్నారని అన్నారు. చంద్రబాబుతో సెల్ఫీలు దిగి తమ ఆనందాన్ని పంచుకుంటున్నారని, ఇది జీవితంలో మరచి పోలేని రోజు అన్నారు.
MP Appalanaidu Key Comments on Stree Sakthi
మహిళలు, రైతులు ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం అందుబాటులో ఉండి వారికి తోడ్పాటు అందిస్తోందన్నారు. రాష్ట్రాభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం అన్నారు. గతంలో మేని ఫెస్టోలో ప్రకటించినట్టుగానే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. గతంలో చెప్పినదానికి కట్టుబడి అమలు చేశామని చెప్పారు ఎంపీ. ఆగస్టు 15వ తేదిన ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. చంద్ర బాబు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు చేయడం జరిగిందన్నారు. దీంతో మహిళల ఆనందానికి అవధులు లేవన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి ముఖ్యమంత్రి మహిళలకు ఈ సదుపాయం కల్పించారనని అన్నారు. చంద్రబాబు విజనరి లీడర్, మంచి అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు, రాష్ట్రాభివృద్ధికి పూర్తి సహాయ సహకరాలు అందించే వ్యక్తి. కూటమి ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన సాగిస్తోందన్నారు.
Also Read : TTD Darshan Quota Interesting Update : నవంబర్ నెల దర్శన టికెట్ల కోటా రిలీజ్















