PM Modi : కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యువతకు తీపి కబురు చెప్పారు ఎర్రకోట సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎవరైనా సరే ఇండియాకు చెందిన వారు ప్రైవేట్ కంపెనీలలో జాయిన్ అయితే వారికి భరోసా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం ప్రైవేట్ , అసంఘటిత రంగాలలో పని చేసే వారికి మాత్రమే వర్తిస్తుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి కొత్త పథకాన్ని తీసుకు వస్తున్నట్లు తెలిపారు. దాని పేరు ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన. ఈ స్కీంలో భాగంగా తొలిసారి చేరితే నేరుగా సర్కార్ రూ 15 వేలు ఇస్తుంది.
PM Modi Key Comments
ఈ స్కీం కింద జూలై 31 లోపు ఎవరైనా ప్రైవట్ కంపెనీలో చేరితే రెండు రూ . 15 వేలు చెల్లిస్తుంది. ఆగస్టు 1 నుంచి కూడా చేరిన వారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునేందుకు వీలుందని ప్రకటించారు మోదీ (PM Modi). మొదటి ఆరు నెలలు సగం పైసలు, 12 నెలలు అయ్యాక మరో సగం డబ్బులు ఇస్తుంది. ఇదే సమయంలో ప్రైవేట్ సంస్థల యజమానులకు కూడా కొన్ని ప్రయోజనాలు కల్పించనుంది. ఈ స్కీం కోసం కేంద్రం రూ. 99,446 కోట్లు కేటాయించింది.కేవలం యువత కోసమే వెచ్చించనున్నట్లు ప్రకటించారు నరేంద్ర మోదీ. అయితే నెలకు రూ.లక్ష లోపు జీతం పొందే జాబర్స్ అంతా స్కీమ్ కు అర్హులు కావడం విశేషం. దీని ద్వారా రూ 3.5 కోట్లకు పైగా జాబ్స్ క్రియేట్ చేయాలన్నది తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు పీఎం. ఈ పథకం ఎందరికో భద్రత ఇస్తుందని చెప్పారు.
Also Read : Donald Trump Interesting Comments : ఉక్రెయిన్ పై యుద్దానికి తాత్కాలిక విరమణ

















