MLA Komatireddy : నల్లగొండ జిల్లా – సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఉద్దేశించి పదవులు మీకే, పైసలు కూడా మీకే వస్తున్నాయంటూ ఆరోపించారు. మీరు పోస్టులు తీసుకోండి కానీ అభివృద్ది పనులకైనా డబ్బులు ఇవ్వాలని కోరారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఓ వైపు హై కమాండ్ ఎవరూ నోరు మెదప వద్దంటూ ఆదేశించినా ఎక్కడా తగ్గడం లేదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy). ప్రస్తుతం ఏఐసీసీలో, పీసీసీలో తను హాట్ టాపిక్ గా మారారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ స్వంత కూటమి నుంచే ఎమ్మెల్యే ధిక్కార స్వరం వినిపించడం విస్తు పోయేలా చేసింది.
MLA Komatireddy Raj Gopal Reddy Key Comments
దీనికి ఆజ్యం పోసింది ఇటీవల మంత్రివర్గం విస్తరణనే. తాను పార్టీలో చేరిన సమయంలో తప్పకుండా మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చిందని, కానీ దానిని అమలు చేయడంలో వివక్ష చూపిస్తున్నారంటూ ఆరోపించారు. దీనిపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన మొదటిసారి జై తెలంగాణ అని అన్నారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం సీటు ఒక్కటే ఉంటుందని, దానిపై అందరూ కన్నేసి ఉంచారని, అందరికీ ఇవ్వడం కుదరదన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్దం కొనసాగుతోంది. ఇంకో వైపు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేపట్టడం పట్ల కూడా చర్చ జరుగుతోంది.
Also Read : Deputy CM Pawan – Women Growth : మహిళలకు ఆర్థిక భరోసా నిరంతర భద్రత
















