Coolie : సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన మూవీ కూలీ (Coolie). సూపర్ స్టార్ రజనీకాంత్, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్య రాజ్ , సౌబీర్ , శ్రుతీ హాసన్, రచితా రామ్ కీ రోల్ పోషించగా స్పెషల్ సాంగ్ లో దుమ్ము రేపింది పూజా హెగ్డే. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ఏకంగా తొలి రోజే రూ. 170 కోట్లకు పైగా వసూలు చేసింది. సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. కూలీకి పోటీగా జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ ముఖ్య భూమిక పోషించిన వార్ -2 చిత్రం పోటీగా విడుదలైనా ఆ మూవీకి ఆశించన మేర స్పందన రాలేదు. వార్ -2 తెలుగులో దుమ్ము రేపుతుండగా హిందీలో మాత్రం చతికిల పడింది. నిర్మాత నాగవంశీ ఏకంగా తెలుగు రైట్స్ ను ఏకంగా రూ. 90 కోట్లకు వెచ్చించి తీసుకున్నాడు. అంత వస్తుందా అన్నది అనుమానమే.
Coolie Movie Sensational Collections in Karnataka
ఇదిలా ఉండగా కన్నడనాట కూలీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. లియో, సలార్, పుష్ప -2 రికార్డులను బద్దలు కొట్టడం సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. కాగా కూలీ మూవీ గతంలో లోకేష్ కనగరాజ్ తీసిన విక్రమ్, మాస్టర్ చిత్రాలతో పోల్చలేమని అంటున్నారు. అయినా సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. విచిత్రం ఏమిటంటే తమిళ సినీ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న రజనీకాంత్ స్వస్థలం కర్ణాటక. తను మొదట ఆర్టీసీలో కండక్టర్ గా పని చేశాడు. ఆ తర్వాత సినీ రంగంపై ఉన్న ప్రేమతో చెన్నైకి చెక్కేశాడు. అక్కడ దివంగత దర్శకుడు బాలచందర్ దృష్టిలో పడ్డాడు. ఆనాటి నుంచి నేటి దాకా 70 ఏళ్లకు పైబడినా ఇంకా సినిమాలలో నటిస్తూనే ఉన్నాడు. తన హవా కొనసాగిస్తూ వస్తున్నాడు. రజనీకాంతా మజాకా అంటున్నారు సినీ ప్రేమికులు.
Also Read : Hero Rajinikanth Coolie – Rachita Ram : కూలీ బ్లాక్ బస్టర్ రచితా రామ్ సూపర్


















