Donald Trump : అమెరికా – భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను , యుద్దం జరగకుండా తాను నిలిపానని మరోసారి స్పష్టం చేశారు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). అయితే భారతదేశం, పాకిస్తాన్ అణ్వస్త్ర యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. సాయుధ దక్షిణాసియా పొరుగు దేశాలతో తాను ఈ వివాదాన్ని ఆపితే అమెరికా వారితో చాలా వాణిజ్యం చేస్తుందని తాను చెప్పానని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం అణ్వస్త్ర యుద్ధానికి దారితీసి ఉండవచ్చని అన్నారు. యుద్ద సమయంలో చాలా విమానాలు కూలి పోయాయని, ఆ సమయలో అది అణ్వస్త్ర యుద్దానికి దారితీసి ఉండేదన్నారు ట్రంప్. ఈ సమయంలో తాను ముందుగా గుర్తించడం జరిగిందన్నారు. దీని వల్ల పెద్ద ప్రమాదం జరగకుండా చూశానని, అది తన కారణంగానే జరిగిందని తెలిపారు ప్రెసిడెంట్.
Donald Trump Shocking Comments on India
ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు శుక్రవారం అలాస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యన్ దళాలు ముందుకు రావడంతో ఉక్రెయిన్ ఒత్తిడిలో ఉందన్నారు. అధ్యక్షుడు పుతిన్ ఒక ఒప్పందాన్ని చూడాలనుకుంటున్నారని నేను అనుకుంటున్నానని స్పష్టం చేశారు ట్రంప్. తాను గనుక అధ్యక్షుడు కాకపోతే, పుతిన్ ఉక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకునేవాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఎప్పుడూ జరగకూడని తాను కోరుకున్నానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కీలకమైన అంశాలపై చర్చించేందుకు ఆస్కారం ఉందన్నారు ప్రెసిడెంట్. తాను ఇప్పటి వరకు ఆరు యుద్దాలు జరగకుండా ఆపానని చెప్పారు డొనాల్డ్ ట్రంప్.
Also Read : Kodandaram Reddy Shocking Comments : పదవుల కోసం ఏనాడూ పాకులాడ లేదు
















