Gutha Sukender Reddy : తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తక్షణమే కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన నిధులను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో గతంలో అప్పులు చేసి పనులు చేపట్టారని, తీరా ఇప్పటి దాకా చెల్లించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. తనను కలిసి వారి గోడు వెళ్ల బోసుకున్నారని మానవతా దృక్పథంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని సూచించారు. ప్రస్తుతం శాసన మండలి చైర్మన్ సుదీర్ఘ లేఖ రాయడం కలకలం రేపింది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్సీలను నామినేట్ చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్దమంటూ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఒంటెత్తు పోకడను ప్రశ్నించింది. ఒక రకంగా తల దించుకునేలా చేసింది.
Gutha Sukender Reddy Key Comments
ఇదిలా ఉండగా ఇప్పటికే కాంట్రాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరు పట్ల. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిధులు విడుదల చేయకుండా ఆలస్యం చస్తున్నారంటూ ఆరోపించారు. ఆపై ఏకంగా సచివాలయంలో బహిరంగంగానే నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో మండలి చైర్మన్ గుత్తా రాసిన లేఖ ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రం అంతటా మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పూర్తయిన సివిల్ పనులకు పెండింగ్ బిల్లులు రూ.361.350 కోట్లు ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేసి వారిని ఆదుకోవాలని కోరారు సీఎంను. రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల (స్కూల్ పేరెంట్స్ కమిటీ) అవసరాలను తీర్చడం చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్య కాబట్టి, వెంటనే నిధులు రిలీజ్ చేయాలన్నారు. చిన్న, పేద కాంట్రాక్టర్లు , అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల సభ్యులు చేతి రుణాలు తీసుకుని ఈ పనులను పూర్తి చేశారని, బిల్లులు రాక పోవడంతో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.
Also Read : Minister Vasamshetty Subhash Alarming : అన్నదాత సుఖీభవ రైతన్నలకు భరోసా


















